
ప్రముఖ ఆర్జే మహ్‌వశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పోస్ట్‌లోని కామెంట్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. చాహల్‌తో ఆమె డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి.
Key Points
ఆర్జే మహ్‌వశ్ చాహల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మహ్‌వశ్ పోస్ట్‌లో 'జీవితంలో మిగిలిన భాగాలు మరింత దారుణంగా ఉంటాయి' అని రాసింది.
చాహల్ మరియు మహ్‌వశ్ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
చాహల్ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు.
మహ్‌వశ్ సోషల్ మీడియా పోస్ట్
ప్రముఖ ఆర్జే మహ్ వశ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది . ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది . ఇటీవల లండన్ వెకేషన్ లో ఉన్న చిత్రాలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది . లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది . అయితే ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తో డేటింగ్ లో ఉందంటూ గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే .
లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాహల్ తో డేటింగ్ పై చర్చ మొదలైంది . అదే లోకేషన్ లో చాహల్ కూడా ఫోటోలు పోస్ట్ చేయడం ఈ జంట డేటింగ్ నిజమేనని అందరూ ఫిక్సయిపోయారు . తరచుగా వీరిద్దరు పార్టీల్లో కనిపించడం ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది . చాహల్ విడాకుల తర్వాత మహ్ వశ్ మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది . అందుకే ఐపీఎల్ లోనూ పంజాబ్ మ్యాచ్ ల్లో సందడి చేసింది .
చాహల్-మహ్‌వశ్ డేటింగ్ ఊహాగానాలు
తాజాగా చాహల్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో విషెస్ తెలిపింది . జూలై 23 న చాహల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది . లండన్ లోని ఓ రెస్టారెంట్ లో చాహల్ కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది .
పోస్ట్‌లోని ‘దారుణంగా’ అనే పదం చర్చనీయాంశం
మహ్ వశ్ తన క్యాప్షన్ లో .. “పుట్టినరోజు శుభాకాంక్షలు యుజీ! వయసు పెరగడం అనేది మన జీవితంలో ఒక భాగం . అలాగే జీవితంలో మిగిలిన భాగాలు మరింత దారుణంగా ఉంటాయి. అందుకే ఆల్ ది బెస్ట్ ” అంటూ ఫన్నీ ఎమోజీతో పోస్ట్ చేసింది . ఇప్పటికే వీరిద్దరి డేటింగ్ లో ఉన్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ .. ఈ పోస్ట్ తో మరింత క్లారిటీ వచ్చేసింది . ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ డేటింగ్ పై ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు . అయితే జీవితంలో మిగతావన్నీ కూడా దారుణంగా ఉంటాయని రాయడం చర్చనీయాంశంగా మారింది . చాహల్ – ధనశ్రీ వర్మ విడాకులను ఉద్దేశించి చేసినట్లు అర్థమవుతోంది . కాగా .. చాహల్ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు .
చివరగా, ఆర్జే మహ్‌వశ్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాహల్ మరియు మహ్‌వశ్ మధ్య ఉన్న సంబంధంపై ఇంకా స్పష్టత లేదు.


