
📌 Key Points
- సాయి పల్లవి ‘మేరే రహో’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం.
- ‘రామాయణం’ సినిమాలో సీత పాత్రకు ఎంపికైన సాయి పల్లవి.
- బడా సినిమాల పోటీ కారణంగా ‘మేరే రహో’ విడుదల వాయిదా.
- ‘మేరే రహో’ ఫలితం రామాయణంపై పడుతుందేమోనని అభిమానుల ఆందోళన.
సాయి పల్లవి తొలి బాలీవుడ్ చిత్రం ‘మేరే రహో’ విడుదల వాయిదా పడింది. గత డిసెంబర్‌లో రావాల్సిన ఈ సినిమా, బడా చిత్రాల పోటీతో ఆలస్యమైంది. దీని ఫలితం సుమారు 4 వేల కోట్లతో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో ఆమె సీత పాత్రపై ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఆమె కెరీర్‌పై కీలక మలుపు అవుతుంది.
సాయి పల్లవి తొలి బాలీవుడ్ చిత్రం ‘మేరే రహో’
SaiPallavi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి పల్లవి (Sai Pallavi) లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా అభిమానుల చేత దక్కించుకుంది. అద్భుతమైన నటనతో.. డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఉర్రూతలూగించే ఈమె.. తన అందంతో అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన మొదటి చిత్రంగా మేరే రహో అనే చిత్రంలో నటించింది.
మరొకవైపు సుమారుగా 4 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇదే ఆమె తొలి డెబ్యూ అనుకున్నారు. కానీ దానికంటే ముందే ఈమె అమీర్ ఖాన్ నిర్మించిన మేరే రహో అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. పైగా ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్లో విడుదల చేయాల్సి ఉండగా.. విడుదల ఆగిపోయింది. దీనికి కారణం బడా చిత్రాలే అనే చెప్పాలి. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్లో రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ రికార్డు సృష్టించింది.
సినిమా వాయిదాకు కారణాలు ఏమిటి?
ఈ చిత్రంతోపాటు హాలీవుడ్ అవతార్ ఫ్రాంచైజీ అవతార్ 3 తో పాటూ అనన్య పాండే, కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ ప్యూర్ లవ్ డ్రామా మూవీ తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ చిత్రాలు విడుదలయ్యాయి. ఇలాంటి చిత్రాల మధ్య తమ సినిమాను విడుదల చేస్తే అసలు ఆదరించరేమో అనే కారణంతోనే అమీర్ ఖాన్ నిర్మించిన మేరే రహో చిత్రం వాయిదా పడింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్నారు కానీ ఈ చిత్రాల కారణంగానే ఈ సినిమాను ఈ ఏడాది జూన్ కి వాయిదా వేశారు.
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఫలితం రామాయణం మీద పడుతుందేమో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ..మేరే రహో సినిమా విజయం సాధించింది అంటే సాయి పల్లవికి హిందీలో మార్కెట్ పెరుగుతుంది.. ఒకవేళ డిజాస్టర్ గా నిలిస్తే మాత్రం ఈ సినిమా ఫలితం రామాయణం పై పడుతుందని కొంతమంది ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ కోసమే వెనక్కి తగ్గిన సాయి పల్లవి మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
రామాయణంపై ‘మేరే రహో’ ప్రభావం ఎంత?
‘మేరే రహో’ సినిమా వాయిదా సాయి పల్లవి అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బాలీవుడ్ డెబ్యూ ఫలితం రామాయణం ప్రాజెక్టుపై ప్రభావం చూపిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ మొత్తం పరిణామం ఆమె సినీ కెరీర్‌కు కీలకం కానుంది.


