
📌 Key Points
- సలీం ఖాన్ మెదడులో రక్తస్రావం కావడంతో లీలావతి ఆసుపత్రిలో చేరారు.
- ప్రస్తుతం సలీం ఖాన్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు, వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
- సల్మాన్ ఖాన్, కుటుంబ సభ్యులు, జావేద్ అక్తర్ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు.
- సలీం-జావేద్ ద్వయం బాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ ట్రెండ్ సృష్టించారు.
బాలీవుడ్ ప్రముఖ రచయిత సలీం ఖాన్ అనారోగ్యం పాలయ్యారు. మెదడులో రక్తస్రావం కావడంతో ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
సలీం ఖాన్ ఆసుపత్రిలో చేరిక
Salman Khan Father: బాలీవుడ్ సినీ పరిశ్రమలో దిగ్గజ కథా రచయితగా పేరు దక్కించుకున్న సలీం ఖాన్ (Salim Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ తరం యువతకు ఈయన గురించి ప్రస్తావించాల్సి వస్తే సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడిగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు దక్కించుకున్న సల్మాన్ ఖాన్ అంటే ఏ తరం వారైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి సల్మాన్ ఖాన్ తండ్రిగా మరింత పేరు దక్కించుకున్నారు సలీం ఖాన్. ఇకపోతే మంగళవారం ఉదయం ఆయన అనారోగ్య కారణాలతో ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేరారు.
ఈ విషయం తెలిసి అటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు ఏమైంది? హాస్పిటల్లో అందులోనూ ఐసీయూలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సలీం ఖాన్ మెదడులో రక్తస్రావం జరగడం వల్లే ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తల తిరగడం, రక్తపోటు పెరగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. మెదడులో కుడి వైపున రక్తస్రావం జరగడం వల్ల ఈ లక్షణాలు బయట పడినట్లు వైద్యులు నిర్ధారించారు.
సలీం ఖాన్ ఆరోగ్య పరిస్థితి
ఇక సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు జావేద్ అక్తర్ , సంజయ్ దత్ వంటి ప్రముఖులు ఆసుపత్రికి చేరుకున్నారు. అటు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మొత్తానికైతే సలీం ఖాన్ వయసు 90 సంవత్సరాలు కావడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ .. వయస్సు రీత్యా ఇంకా జాగ్రత్తగా ఆయనను నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
సలీం ఖాన్ విషయానికి వస్తే.. సలీం – జావేద్ ద్వయంగా ఆయన జావేద్ అక్తర్ తో కలసి షోలే , దీవార్ , జంజీర్, డాన్ వంటి ఎన్నో ఐకానిక్ చిత్రాలను అందించారు. బాలీవుడ్ లో “యాంగ్రీ యంగ్ మ్యాన్” ట్రెండ్ సృష్టించి రచయితల గౌరవాన్ని పెంచిన ఘనత కూడా ఈయనదే. అలాంటి సలీం ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఖాన్ కుటుంబ సభ్యులందరూ లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. సల్మాన్ ఖాన్, అర్భాజ్ ఖాన్, అర్పితా ఖాన్, అల్విరా ఖాన్ లతోపాటు సలీం ఖాన్ భార్యలు సల్మా, హెలెన్ కూడా చేరుకున్నారు. ఇక ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో సలీంఖాన్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
కుటుంబ సభ్యుల పరామర్శ
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరోగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. అటు వ్యక్తిగతంగా హత్యా బెదిరింపులు ఎదుర్కొంటూ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస విషాదాలు అభిమానులను కలవరపరుస్తుంటే.. మరొకవైపు హత్యా బెదిరింపులు భయాందోళనలకు గురిచేస్తోంది. మరి ఈ సమస్యల నుండి బాలీవుడ్ తారలు ఎప్పుడు బయటపడతారో చూడాలి.
సలీం ఖాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం వేచి చూడండి.


