|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Salman Khan: కరీనా కపూర్‌ నాకు అభిమాని.. తన వాష్‌రూమ్‌లో కూడా నా పోస్టరే..!

Published: 25-06-2025, 4:58 AM
Salman Khan: కరీనా కపూర్‌ నాకు అభిమాని.. తన వాష్‌రూమ్‌లో కూడా నా పోస్టరే..!

సల్మాన్ ఖాన్ తన అనుభవాలను గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పంచుకున్నాడు. కరీనా కపూర్ బాత్రూంలో సల్మాన్ పోస్టర్ ఉండటం గురించి ఆయన చెప్పిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ ట్రియో ప్రయాణాల గురించి కూడా ఆయన మాట్లాడాడు.

Key Points

1

సల్మాన్ ఖాన్ గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో తన అనుభవాలను పంచుకున్నాడు.

2

కరీనా కపూర్ తన బాత్రూంలో సల్మాన్ ఖాన్ పోస్టర్ పెట్టుకుంది!

4

ఆమిర్ ఖాన్ సూచన మేరకు చందమామకు వెళ్ళడం గురించి సల్మాన్ చర్చించాడు.

గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సల్మాన్ ఖాన్

అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలు, పోస్టర్లు గది నిండా నింపుకుంటుంటారు చాలామంది. అయితే ఓ హీరోయిన్‌ తన బాత్రూమ్‌లో స్టార్‌ హీరో పోస్టర్లు అతికించిందుకుందట! ఈ విషయాన్ని భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ ( Salman Khan ) బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.. కరీనా కపూర్‌! ఆమె అతికించిన పోస్టర్‌దో ఎవరికో కాదు సల్మాన్‌దే!

సల్మాన్‌పై ఫన్నీ పోస్టర్లు సల్మాన్‌ ఖాన్‌.. ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో మూడో సీజన్‌కు మొదటి గెస్టుగా విచ్చేశాడు. షోలో ప్రసారం చేయని అన్‌సీన్‌ ఫుటేజ్‌ను తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేశాడు. అందులో రోడ్డు పక్కన, కళ్లజోడు దుకాణంలో, మెన్స్‌ సెలూన్‌లో సల్మాన్‌ను ఎలా వాడేస్తున్నారనేది తెలియజేస్తూ ఆయా పోస్టర్లను చూపించాడు. అవి చూసి నవ్వేసిన హీరో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.

కరీనా కపూర్ మరియు సల్మాన్ ఖాన్

కరీనా బాత్రూమ్‌లో నా పోస్టర్‌ కరీనా కపూర్‌ బాత్రూమ్‌లో కూడా నా పోస్టర్‌ ఉందని విన్నాను. తర్వాత నేనోసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చూశాను. అప్పుడామె వయసు 8 ఏళ్లుంటాయనుకుంటాను. తనకు 15 ఏళ్లొచ్చాక నా పోస్టర్‌ తీసేసి రాహుల్‌ రాయ్‌ పోస్టర్‌ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా, సల్మాన్‌ బాడీగార్డ్‌, క్యూంకీ, బజ్‌రంగీ భాయ్‌జాన్‌ వంటి చిత్రాల్లో నటించారు.

ట్రిప్పుకెళ్తాం బాలీవుడ్‌ ట్రియో (ఆమిర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ త్రయం) గురించి చెప్తూ.. ఆమిర్‌ ఖాన్‌, నేను, షారూఖ్‌.. ముగ్గురం కలిసి ఓ ట్రిప్‌కు వెళ్దామని ఆమిర్‌ అన్నాడు. ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం అన్నాడు. ఇంతలో అర్చన పూరణ్‌ సింగ్‌ కలగజేసుకుంటూ ఎవరికీ తెలియని చోటంటూ భూమిపై ఏదీ లేదు. మీరు చందమామ పైకి వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అందుకు హీరో నవ్వుతూ.. అవును, అది ట్రై చేయొచ్చు, కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం అని సరదాగా అన్నాడు.

బాలీవుడ్ ట్రియో యొక్క ట్రిప్ ప్లాన్స్

సల్మాన్ ఖాన్ మరియు కరీనా కపూర్ మధ్య అభిమానం, బాలీవుడ్ ట్రియో యొక్క భవిష్యత్తు ప్రయాణాలు ఇలా చాలా ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వెల్లడయ్యాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.