|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సత్య జనరల్ కంపార్ట్‌మెంట్ కామెడీ: గాల్లో జెట్‌లీ ట్రెయిలర్ రచ్చ!

Published: 03-01-2026, 10:00 AM
సత్య జనరల్ కంపార్ట్‌మెంట్ కామెడీ: గాల్లో జెట్‌లీ ట్రెయిలర్ రచ్చ!
  • “జెట్‌లీ” సినిమా కథ మొత్తం ఒక విమానంలో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ తిరుగుతుంది.
  • హాస్యనటుడు సత్య లాంగ్ హెయిర్, రఫ్ లుక్‌తో హీరోగా విభిన్న పాత్రలో అలరించనున్నాడు.
  • “మత్తు వదలరా” దర్శకుడు రిటేష్ రానా వినూత్నమైన కామెడీ-సస్పెన్స్ కథను తెరకెక్కిస్తున్నారు.
  • రియా సింగ్ హీరోయిన్‌గా పరిచయం అవుతూ, యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకోగా వెన్నెల కిశోర్ కామెడీకి బలం.

రిటేష్ రానా దర్శకత్వంలో హాస్యనటుడు సత్య హీరోగా నటించిన “జెట్‌లీ” ట్రైలర్ విడుదలైంది. విమానం నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో సత్య కొత్త అవతారంలో, రియా సింగ్ హీరోయిన్‌గా అలరించనున్నారు. కామెడీ, సస్పెన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ సంకేతమిస్తోంది.

“జెట్‌లీ” కథాంశం: గాల్లో వినోదం

Jetlee Trailer Review: రిటేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా జెట్‌లీ. గతంలో మత్తు వదలరాతో.. పెద్ద విజయం అందుకున్న రిటేష్ రానా.. ఈసారి కూడా తనదైన శైలిలో వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా మొత్తం ఒక విమానం నేపథ్యంగా సాగుతుండటం.. ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు సత్య హీరోగా నటిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, లాంగ్ హెయిర్‌తో, కొంచెం రఫ్ లుక్‌లో సత్య కనిపించబోతున్నారు. గ్లింప్స్‌లో ఆయన కామెడీ టైమింగ్‌తో పాటు నటన కూడా ఆకట్టుకుంటుంది. మత్తు వదలరా సినిమాల్లో కూడా సత్యా క్యారెక్టర్ హైలెట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమాలో కూడా అదే వినోదం పంచేలా కనిపిస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన టీజర్ లో..విమానం గాల్లో ఊగిపోతున్న సమయంలో.. సత్య చేసే ఎంట్రీతో సినిమా టోన్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ సినిమాతో రియా సింగ్ తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నది. మిస్ యూనివర్స్ ఇండియా 2024గా గుర్తింపు పొందిన రియా సింగ్.. గ్లింప్స్‌లో స్టైలిష్ యాక్షన్ సీన్స్ చేస్తూ కనిపించారు. ఆమె పాత్ర సినిమాలో ముఖ్యమైనదిగా ఉండబోతుందనే సంకేతాలు గ్లింప్స్‌లోనే కనిపించాయి.

సత్య కొత్త అవతారం: జనరల్ కంపార్ట్‌మెంట్ కామెడీ

కామెడీకి మరింత బలం చేకూర్చే పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నారు అని కూడా ఈ తేజ చూస్తే అర్థమవుతుంది. “నువ్వు హీరోవా?” అని అడిగి.. “టియర్ వన్, టియర్ టూ, టియర్ త్రీ?” అని ప్రశ్నించగా..సత్య “జనరల్ కంపార్ట్మెంట్” అని సమాధానం చెప్పే సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ డైలాగ్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.

ఈ చిత్రంలో అజయ్, వివా హర్ష, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చరణ్జీవి, హేమలత పెడమల్లు నిర్మిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. సంగీతాన్ని కాల భైరవ అందించారు.

రియా సింగ్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం

విమానంలో జరిగే అనూహ్య సంఘటనలు, హాస్యం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో జెట్‌లీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే నమ్మకాన్ని ఈ గ్లింప్స్ కలిగిస్తోంది. నవ్వులతో పాటు ఉత్కంఠను కూడా అందించే సినిమాగా ఇది నిలవనుందని.. అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Satya 💥💥🔥🔥🙂‍↕️🙂‍↕️🤯🤯 #Jetlee pic.twitter.com/qrs626g82q

— Movies4u Official (@Movies4u_Officl) January 3, 2026

“జెట్‌లీ” ట్రైలర్ నవ్వులు, ఉత్కంఠ పంచుతూ సినిమాపై అంచనాలను పెంచింది. విమానంలో జరిగే ఈ విభిన్న కథ ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుంటుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.