
గ్రహాల సంచారం వల్ల శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 27న శని, సూర్యుల సంయోగం కొన్ని రాశులకు అదృష్టాన్నిస్తుంది. వృషభ, మిథున, వృశ్చిక రాశుల వారు ఈ సంయోగం వల్ల ప్రయోజనం పొందుతారు.
Key Points
సెప్టెంబర్ 27న శని-సూర్య సంయోగం వృషభ, మిథున, వృశ్చిక రాశులకు శుభప్రదం.
ఆస్తులు, వాహనాలు, ఉద్యోగాలు లభించే అవకాశం.
వ్యాపార లాభాలు, కుటుంబ సంతోషం పెరుగుతాయి.
విద్యార్థులకు మంచి ఫలితాలు, కష్టానికి తగిన ప్రతిఫలం.
వృషభ రాశి వారికి శుభ ఫలితాలు
గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. న్యాయదేవుడు శని కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. శని మనం చేసే పనుల్ని బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తే, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇస్తాడు.
ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు. ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాడు. అయితే శని మరో గ్రహంతో సంయోగం చెందినప్పుడు అది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక ప్రత్యేకమైన సంయోగం సెప్టెంబర్ 27న చోటు చేసుకోనుంది. ఈ సంయోగంతో కొన్ని రాశుల వారి భవితవ్యం మారనుంది.
కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది, రివార్డ్స్‌ను పొందుతారు. కొత్త షాపు, భూమి లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. మరి సెప్టెంబర్ 27న శని–సూర్యుల సంయోగంతో ఏ రాశుల వారికి కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు తెలుసుకుందాం.
మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు
వృషభ రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగం మంచి ఫలితాలను తీసుకు రానుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రాశి విద్యార్థులకు కూడా మంచి సమయం. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది, రివార్డ్స్‌ను పొందుతారు. వ్యాపార పనుల మీద ప్రయాణం చేస్తే కలిసివస్తుంది.
మిథున రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగం అద్భుతమైన ఫలితాలను తీసుకు వస్తోంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. పిల్లలు కూడా శుభవార్తలు చెబుతారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. దగ్గర స్నేహితుల నుంచి ఎక్కువ సపోర్ట్‌ను పొందుతారు. కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త షాపు, భూమి లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి వారికి అనుకూల మార్పులు
వృశ్చిక రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల సంయోగం అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. సానుకూల మార్పులను చూస్తారు. ఆస్తులు, వాహనాలు మొదలైనవి మీ దరి చేరుతాయి. సహనంతో ఉంటే అనుకున్నవన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
శని-సూర్య సంయోగం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సూచనలు సాధారణ సూచనలు మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి.


