
📌 Key Points
- న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన కొత్త ప్రేమికురాలిని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
- బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో సాన్నిహిత్యం కారణంగా దీప్తి సునైనాతో ఆయన బ్రేకప్ అయింది.
- షణ్ముఖ్ పోస్ట్ చేసిన ఫోటోలలో కొత్త లవర్ పేరు ‘V’ తో మొదలవుతుందని సూచన ఉంది.
- దీప్తితో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా సంచలనం షణ్ముఖ్ జస్వంత్ తన అభిమానులకు కొత్త ఏడాది షాక్ ఇచ్చాడు. దీప్తి సునైనాతో బ్రేకప్ తర్వాత, ఆయన కొత్త ప్రేమికురాలిని పరిచయం చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె ఎవరు, వారి ప్రేమ కథేంటో తెలుసుకుందాం.
షణ్ముఖ్ ప్రేమ ప్రయాణం: దీప్తి నుండి ‘V’ వరకు
న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన కొత్త ప్రేమికురాలిని పరిచయం చేసాడు. (Shanmukh Jaswanth)
Shanmukh Jaswanth : సోషల్ మీడియాలో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. కరోనా తరవాత బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత వైరల్ అయ్యాడు. అప్పుడే వార్తల్లో కూడా నిలిచాడు. బిగ్ బాస్ ముందు దీప్తి సునైనాతో ప్రేమలో ఉండేవాడు షణ్ముఖ్. వీళ్ళిద్దరూ బహిరంగంగానే తమ ప్రేమని చూపించారు.(Shanmukh Jaswanth)
అయితే బిగ్ బాస్ లో షణ్ముఖ్ సిరి హన్మంత్ కి క్లోజ్ గా ఉండటంతో దీప్తితో బ్రేకప్ అయిపొయింది. వీరి బ్రేకప్ ని కూడా అధికారికంగానే ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ షణ్ముఖ్ సిరీస్ లు, సినిమాలు ట్రై చేస్తున్నాడు. మధ్యలో ఓ యాక్సిడెంట్, గంజాయి తాగాడు అని వివాదాల్లో నిలిచాడు.
బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ కథ
కానీ తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన కొత్త ప్రేమికురాలిని పరిచయం చేసాడు. ముఖం కనపడకుండా ఓ అమ్మాయితో దిగిన పలు ఫోటోలను షేర్ చేసి షణ్ముఖ్.. హ్యాపీ బర్త్ డే V. ఇది దేవుడి ప్లాన్ అని పోస్ట్ చేసాడు. దీంతో ఆ అమ్మాయి పేరు V తో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు.
మరి ఆ అమ్మాయి ఎవరు? వీరి పరిచయం, ప్రేమ సంగతి ఏంటి అని షన్ను ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఇక దీప్తి తో మూవ్ ఆన్ అయినట్టే షణ్ముఖ్ కొత్త జీవితంలోకి వెళ్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేయసి వరో ఎపుడు చెప్తాడో చూడాలి.
కొత్త లవర్ ‘V’ ఎవరు? ఫ్యాన్స్ లో ఉత్కంఠ
A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
దీప్తితో బ్రేకప్ తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న షణ్ముఖ్, తన కొత్త ప్రేమికురాలి గురించి ఎప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తారో చూడాలి. అభిమానులు మాత్రం ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


