
📌 Key Points
- బిగ్ బాస్ తర్వాత షణ్ముఖ్, దీప్తి సునయన బ్రేకప్ అయ్యారు.
- కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రేయసితో షణ్ముఖ్ ఫోటోలు షేర్ చేశారు.
- ఆమె ముఖం కనిపించకుండా ‘హ్యాపీ బర్త్ డే V’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
- దీంతో అభిమానుల్లో షణ్ముఖ్ కొత్త ప్రేమ కథపై ఆసక్తి నెలకొంది.
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఒక యువతితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షణ్ముఖ్ – దీప్తి బ్రేకప్ ఎందుకు?
Shanmukh Jaswanth: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ నిత్యం వారికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రస్తుతం ఎంతో మంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిపోయిన వారిలో ప్రముఖ నటుడు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh jaswanth)ఒకరు. షణ్ముఖ్ కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss 5) రియాలిటీ షోలో పాల్గొని రన్నర్ గా బయటకు వచ్చారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా షణ్ముఖ్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలను మొత్తం నాశనం చేసుకొని బయటకు వచ్చారని సంగతి తెలిసిందే.
ఈయన హౌస్ లోకి వెళ్లడానికి ముందుగానే మరొక నటి దీప్తి సునయన(Deepthi Sunaina)తో ప్రేమలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత హౌస్ లో నటి సిరి హనుమంత్ తో చాలా క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి పట్ల ఎంతో నెగిటివిటీ వచ్చింది. దీంతో దీప్తి సునయన షన్నుకు బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కెరియర్ పరంగా బిజీగా ఉన్న షణ్ముఖ్ మరోసారి ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. తాజాగా ఈయన తన ప్రియురాలిని పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొత్త ప్రేయసిని పరిచయం చేసిన షణ్ముఖ్
న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ ఒక యువతీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఆమె మొహం ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన “హ్యాపీ బర్త్డే V….. ఇదంతా దేవుడి ప్లాన్” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన మరోసారి ప్రేమలో పడ్డారని తన ప్రియురాలిని ఇలా పరిచయం చేశారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎవరా ‘V’ అక్షరంతో మొదలయ్యే యువతి?
ఇక ఈమె పేరు ‘ వి’ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి షణ్ముఖ్ తో అంత చనువుగా ఉన్న ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా?షణ్ముఖ్ దీప్తి సునయనను పూర్తిగా పక్కన పెట్టి మరో అడుగు ముందుకు వేశారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రశ్నలపై షణ్ముఖ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.. ఇక దీప్తి సునయన షన్నుతో బ్రేకప్ తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే మరోవైపు బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితంలో కూడా మూవ్ ఆన్ అయ్యారని తెలుస్తోంది.
షణ్ముఖ్ కొత్త లవర్ ఎవరు, వారిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా అనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ మిస్టరీ వీడేంత వరకు అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.


