|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగబాబుకు షాక్: మహిళల ఆగ్రహం, జనసేన నుండి సస్పెన్షన్ డిమాండ్!

Published: 28-12-2025, 1:05 AM
నాగబాబుకు షాక్: మహిళల ఆగ్రహం, జనసేన నుండి సస్పెన్షన్ డిమాండ్!
  • నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
  • శివాజీ వ్యాఖ్యలపై జనసేన నాయకుడు నాగబాబు స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
  • నాగబాబు వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ డిమాండ్ చేస్తున్నారు.
  • నాగబాబు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు.

నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా, వాటిపై జనసేన నాయకుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు స్పందన

Sivaji fans : టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.. అమ్మాయిలా వస్త్రధారణ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆయన ట్రోల్స్ కి గురవుతున్నాడు. సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోకండి అని సలహా ఇచ్చాడు. అదే కాస్త ఇప్పుడు ఆయన మెడకు ఉచ్చుబిగించింది.. మహిళల బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ కొందరు సెలబ్రిటీలు ఆయనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో దీనిపై చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇక రీసెంట్ గా నటుడు శివాజీ మహిళా కమిషనర్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇన్ని రోజుల తర్వాత మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నేటిజెన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. దాంతో నాగబాబుపై ట్రోల్స్ మొదలయ్యాయి..

మెగా బ్రదర్ సినీ నటుడు నాగబాబు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈయన శివాజీ మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో పై నెటిజన్లు దారుణంగా టోల్స్ చేస్తున్నారు. ఇకపోతే కొందరు మహిళలు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివాజీ వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళల మద్దతు పెరిగింది. ఈ క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు. మరి దీనిపై మెగా బ్రదర్ నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి..

మహిళల ఆగ్రహం: జనసేన నుంచి తొలగింపు డిమాండ్

వివాదంపై నెటిజన్ల, సినీ ప్రముఖుల అభిప్రాయాలు

హీరోయిన్లు సామాన్లు కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని, నిండుగా చీర కట్టుకొని బయటకు రావాలి అంటూ ఇటీవల నటుడు శివాజీ ఆయన నటించిన దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాము.. శివాజీ వ్యాఖ్యలపై మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి మాట్లాడుతూ.. హీరోయిన్లను మాత్రమే కాదు.. హీరోలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. జేబుల్లో చేతులు పెడతారు. ఒంటి మీద బంగారం లాక్కెల్తారు. చేతిలో ఫోన్ మాయం చేస్తారు. రకరకాలుగా టార్చర్ పెడుతుంటారు.. హీరోలను లైంగిక వేధింపులకు గురి చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడూ బయటకు చెప్పుకోరు.. మిగిలిన హీరోలు మౌనంగా ఉన్న బాలకృష్ణ మాత్రం కొడతాడు అని పూరి అన్నారు.. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వీడియో వైరల్ అవుతుంది.. ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై పెద్ద వివాదాలే నడుస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ వివాదం ఎప్పుడు ముగిసిపోతుందో చూడాలి…

శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు స్పందన, దానిపై మహిళల ఆగ్రహం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్. ఈ వివాదంపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో, నాగబాబు భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.