|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్! అవతార్ 3లో భయపెట్టిన విలన్.. ఈమె చార్లీ చాప్లిన్ మనవరాలా?

Published: 31-12-2025, 9:01 AM
షాకింగ్! అవతార్ 3లో భయపెట్టిన విలన్.. ఈమె చార్లీ చాప్లిన్ మనవరాలా?
  • అవతార్ 3లో ‘వరంగ్’ అనే విలన్ పాత్రలో ఊనా చాప్లిన్ నటించి మెప్పించింది.
  • లెజెండరీ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ మనవరాలు ఈ ఊనా చాప్లిన్.
  • ఊనా తన తాత, తల్లి గెరాల్డైన్ చాప్లిన్ బాటలో నటనలోకి అడుగుపెట్టింది.
  • 20 ఏళ్లకే షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టి హాలీవుడ్‌లో రాణించింది.

అవతార్ 3లో భయపెట్టే విలన్ పాత్రలో అలరించిన ఊనా చాప్లిన్ ఎవరో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈమె ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ మనవరాలు. హాస్యనటుడి వారసురాలు విలన్‌గా మెప్పించడం విశేషం. ఆమె కెరీర్, అవతార్ 3 పాత్ర గురించి తెలుసుకుందాం.

ఊనా చాప్లిన్ ఎవరు? ఆమె నటించిన పాత్రలు

తాతయ్య తన కామెడీతో అందర్నీ నవ్విస్తే మనవరాలు ఊనా చాప్లిన్ మాత్రం అందర్నీ తన విలనిజంతో భయపెట్టింది. (Oona Chaplin)

Oona Chaplin : ఇటీవల వచ్చిన అవతార్ పార్ట్ 3 గత రెండు సినిమాలతో పోలిస్తే ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. పార్ట్ 2 కథనే మళ్ళీ చూపించారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఫైర్ & యాష్ అనే టైటిల్ పెట్టి దానికి తగట్టు కొంత భాగం మాత్రం చూపించారు.(Oona Chaplin)

ఈ ఫైర్ & యాష్ జాతికి లీడర్ గా వరంగ్ అనే పాత్రలో ఊనా చాప్లిన్ నటించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఊనా చాప్లిన్ తన నటనతో మెప్పించింది. అయితే ఈ ఊనా చాప్లిన్ ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఊనా చాప్లిన్ ఎవరో కాదు హాలీవుడ్ స్టార్ కమెడియన్, తన సినిమాలతో ప్రపంచమంతా నవ్వించిన చార్లీ చాప్లిన్ మనవరాలు.

అవతార్ 3లో ఊనా చాప్లిన్ విలన్ పాత్ర

చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్ కూతురే ఊనా చాప్లిన్. తన తాత, అమ్మ బాటలోనే నటనలోకి ఎంట్రీ ఇచ్చింది ఊనా చాప్లిన్. 20 ఏళ్లకే షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఊనా చాప్లిన్ ఆ తర్వాత హాలీవుడ్ లో టీవీ షోలు, సిరీస్ లు, సినిమాలు చేస్తుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. హాలీవుడ్ లో ఈమె చార్లీ చాప్లిన్ మనవరాలు అని తెలిసినా ఈ అవతార్ సినిమాతో ప్రపంచమంతా తెలిసింది.

తాతయ్య తన కామెడీతో అందర్నీ నవ్విస్తే మనవరాలు ఊనా చాప్లిన్ మాత్రం అందర్నీ తన విలనిజంతో భయపెట్టింది.

చార్లీ చాప్లిన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం

A post shared by Stephanie Comer (@sol22us)

హాస్యనటుడి మనవరాలై ఉండి, అవతార్ 3లో భయంకరమైన విలన్‌గా మెప్పించిన ఊనా చాప్లిన్ బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. తాత వారసత్వాన్ని నిలబెడుతూనే తనదైన ముద్ర వేసి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.