|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ‘సింగిల్’.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Published: 11-05-2025, 11:35 AM
బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ‘సింగిల్’.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శన ఇస్తోంది. రెండు రోజుల్లోనే సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుండటం విశేషం.

Key Points

1

శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది.

2

రెండు రోజుల్లోనే సినిమా 11.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

4

బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి, సండేతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

‘సింగిల్’ సినిమా విజయం

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) గత ఏడాది రెండు సినిమాల్లో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే హిట్, ఫ్లాప్ పట్టించుకోకుండా శ్రీవిష్ణు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ యంగ్ హీరో, కార్తీక్ రాజు(Karthik Raju) కాంబోలో వచ్చిన మూవీ ‘సింగిల్’. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కేతిక శర్మ(Ketika Sharma), ఇవానా హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలు కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప(Bhanu Pratapa), రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న థియేటర్స్‌లోకి వచ్చింది.

అయితే ఈ చిత్రం విడుదలైన కానుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, రెండు రోజుల కలెక్షన్లు షేర్ చేస్తూ శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ పార్టీ మూడ్‌లో ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. తొలి రోజే 4.15 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండో రోజు ఈ చిత్ర వ‌సూళ్లు పెరిగాయి. ఈ మూవీ రెండు రోజుల్లో 11.2కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు సండే కావడంతో ‘సింగిల్’ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

రెండు రోజుల కలెక్షన్స్

భవిష్యత్తు కలెక్షన్స్ అంచనాలు

మొత్తం మీద, ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. సండేతో కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.