|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివకార్తికేయన్‌కు భారీ షాక్: కోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో.. అసలు కథేంటి?

Published: 22-12-2025, 9:44 AM
శివకార్తికేయన్‌కు భారీ షాక్: కోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో.. అసలు కథేంటి?
  • రెమ్యునరేషన్ బకాయిల కోసం మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ దాఖలు.
  • ‘మిస్టర్ లోకల్’ సినిమాకు నిర్మాత జ్ఞానవేల్ రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది.
  • టీడీఎస్ చెల్లించకపోవడంతో ఐటీ శాఖ రూ.90 లక్షలు కట్ చేసిందని శివకార్తికేయన్ ఆరోపణ.
  • బకాయిలు చెల్లించే వరకు జ్ఞానవేల్ సినిమాల విడుదలను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థన.

స్టార్ హీరో శివకార్తికేయన్‌కు పారితోషికం వివాదం ఎదురైంది. ‘మిస్టర్ లోకల్’ నిర్మాత జ్ఞానవేల్ బకాయిలు చెల్లించలేదని, టీడీఎస్ సమస్యలతో ఐటీ శాఖ రూ.90 లక్షలు కట్ చేసిందని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

శివకార్తికేయన్ వర్సెస్ నిర్మాత జ్ఞానవేల్: వివాదం ఎందుకు?

Siva karthikeyan Remuneration Issue: ప్రస్తుతం కోలీవుడ్ ‌ లో అత్యధిక రెమ్యునరేషన్ ‌ తీసుకునే హీరోలో శివ కార్తికేయన్ ‌ ఒకరు . ఈ మధ్య ఆయన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి . కమర్షియల్ ‌ గానూ మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి . దీంతో కోలీవుడ్ ‌ లో ఆయన మార్కెట్ ‌ బాగా పెరిగింది . అలాగే రెమ్యునరేషన్ ‌ గా భారీ పెంచాడు ఈ హీరో . ఇటీవల కాలంగా శివ కార్తికేయన్ ‌ పారితోషికం తమిళ మీడియాల్లో హాట్ ‌ టాపిక్ ‌ గా మారింది . తమిళంలో స్టార్ ‌ హీరోగా ఉన్న శివకార్తికేయన్ ‌ ఇప్పుడు రెమ్యునరేషన్ ‌ కోసం కోర్టు మెట్లు ఎక్కాడు . తన సినిమా నిర్మాత డబ్బులు ఇవ్వకుండ తనని ఇబ్బంది పెడుతున్నాడంటూ మద్రాస్ ‌ హైకోర్టులో ఆయన పిటిషన్ ‌ దాఖలు చేశారు . ప్రస్తుతం ఈ వ్యవహరంలో కోర్టులో ఉంది .

ఇంతకి అసలువిషయం ఏంటి ? శివ కార్తికేయన్ ‌ కి రెమ్యునరేషన్ ‌ ఎగ్గొట్టిన ఆ నిర్మాత ఎవరో ఇక్కడ చూద్దాం . కాగా శివ కార్తికేయన్ ‌ హీరోగా 2019 లో నటించిన చిత్రం ‘ మిస్టర్ ‌ లోకల్ ‌’. నిర్మాత జ్ఞానవేల్ ఈ సినిమాను నిర్మించారు . ఈ సినిమాకు గానూ హీరోకి రూ . 15 కోట్లు రెమ్యునరేషన్ ‌ ఒప్పందం కుదిరింది . అయితే , జ్ఞానవేల్ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పిటిషన్ ‌ లో పేర్కొన్నాడు.

జ్ఞానవేల్‌పై శివకార్తికేయన్ ఫిర్యాదులోని ప్రధానాంశాలు

తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు విడుదల కాకుండా నిలుపాలని శివకార్తికేయన్ చెన్నై కోర్టుని కోరాడు . ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ రాజా హీరోలు సూర్య, కార్తీలకు దగ్గర బంధువనే విషయం తెలిసిందే . అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బొల్తా కొట్టాయి . వీటితో జ్ఞానవేల్ ‌ తీవ్ర నష్టాలను చూశాడు . సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి.

నిర్మాత జ్ఞానవేల్ ఆర్ధిక కష్టాలు, కోర్టు కేసు భవిష్యత్తు

ఈ వివాదాల మధ్య నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ కేసు నుంచి ఎలా గట్టెక్కుతాడనే ఇప్పుడ కోలీవుడ్ ‌ ఆసక్తిని సంతరించుకుది . మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ ‌ అవుతాడో చూడాలి . గతంలోనూ ఆర్థిక లావాదేవిల విషయంలో జ్ఞానవేల్ ‌ రాజా కోర్టు చూట్టు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి . కొన్నిరోజుల క్రితం ఈయన నిర‍్మించిన కొత్త సినిమా ‘వా వాతియర్’ సరిగ్గా రిలీజ్‌కి కొన్ని గంటలు ముందు కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే . దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే మూవీ స్టేకి కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర ఆయన రూ. 20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఈ సినిమాపై స్టే విధించారు .

శివకార్తికేయన్ రెమ్యునరేషన్ వివాదం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. నిర్మాత జ్ఞానవేల్ ఆర్థిక సమస్యలు, టీడీఎస్ అంశాలు ఈ కేసును క్లిష్టం చేశాయి. కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.