
📌 Key Points
- శివ కార్తికేయన్ నటుడు ప్రేమ్ కుమార్ కొడుకు చదువు కోసం రూ. 50 లక్షలు సహాయం చేశారు.
- బ్యాంకులో తనఖా పెట్టడానికి ఇల్లు లేకపోవడంతో ప్రేమ్ కుమార్ ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారు.
- శివ కార్తికేయన్ సహాయంతో ప్రేమ్ కుమార్ కొడుకు నెలకు రూ. 5 లక్షలు సంపాదిస్తున్నాడు.
- సహాయం చేసిన శివ కార్తికేయన్ గొప్ప మనసును అభిమానులు కొనియాడుతున్నారు.
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నటుడు ప్రేమ్ కుమార్ తన కుమారుడి చదువు కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, శివ కార్తికేయన్ రూ. 50 లక్షల ఆర్థిక సహాయం చేశారు. దీనితో ప్రేమ్ కుమార్ కుమారుడు ఉన్నత విద్యను అభ్యసించాడు.
ప్రేమ్ కుమార్ కు శివ కార్తికేయన్ సహాయం
Siva Karthikeyan: సినిమా ఇండస్ట్రీలో తెరపై హీరోలుగా కనిపిస్తూ సందడి చేసే కొంతమంది సెలబ్రిటీలు తెర వెనుక కూడా మంచితనం ఉంది అంటూ పలు సందర్భాలలో బయటపెడుతూ రియల్ హీరో అని పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటూ ఉంటారు. తాము సంపాదించే దాంట్లో కొంత భాగం సహాయ సహకారాల కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఖర్చు చేస్తూ ఉంటారు అలాగే ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు చేసిన సహాయం గురించి బయట చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. వారి నుంచి సహాయం పొందిన వారు చెబితే తప్ప ఇలాంటి విషయాలు బయటపడవు.
ప్రస్తుతం నటుడు శివ కార్తికేయన్ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. తాజాగా తమిళ నటుడు ప్రేమ్ కుమార్(Prem Kumar) కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan)చేసిన సహాయము కారణంగానే నేడు తన కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. శివ కార్తికేయన్ నటించిన హీరో సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా నటించారు ఆ సమయంలో ప్రేమ్ కుమార్ తన కొడుకు చదువుల కోసం డబ్బును సమకూర్చడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.తన కొడుకు ఉన్నత చదువుల కోసం చేతిలో డబ్బు లేకపోవడమే కాకుండా, ఇంటిని తాకట్టు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అప్పటికే ఈఎంఐ ఉండటంవల్ల బ్యాంకు వారు సైతం లోన్ ఇవ్వటానికి నిరాకరించారు.
తన కొడుకు చదువుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రేమ్ కుమార్ తన సమస్యను శివ కార్తికేయన్ కు చెప్పగా, బ్యాంకులో 50 లక్షలకు షూరిటీ ఉంటూ తనకు సాయం చేశారు అప్పుడు ఆయన చేసిన సహాయం కారణంగానే నా కొడుకు ఉన్నత చదువులు చదివి ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు అంటూ ప్రేమ్ కుమార్ శివ కార్తికేయన్ చేసిన సహాయాన్ని ఈ సందర్భంగా బయట పెట్టడంతో శివ కార్తికేయన్ మంచితనంపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం చిన్న పరిచయంతో ఏకంగా 50 లక్షలకు షూరిటీ ఉండడం అంటే మామూలు విషయం కాదు.
చదువు కోసం ఆర్ధిక ఇబ్బందులు
#Sivakarthikeyan helped with my son’s education in Netherlands.We didn’t get any loan as I only had my house 🏡. He gave me ₹50 lakhs as collateral in bank. Today, my son is earning ₹4–5 lakhsall because of him. – Actor #Premkumar pic.twitter.com/47KW1hGdwE
— Movies Singapore (@MoviesSingapore) April 13, 2026
శివ కార్తికేయన్ గొప్ప మనసుపై ప్రశంసలు
ప్రేమ్ కుమార్ పై ఉన్న నమ్మకంతోనే శివ కార్తికేయన్ తనతో పెద్దగా పరిచయం లేకపోయినా 50 లక్షలకు షూరిటీ ఉండి సహాయం చేశారని తెలుస్తోంది. ఇక శివ కార్తికేయన్ విషయానికి వస్తే ఇటీవల ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా మరో వైపు నిర్మాతగా కూడా మారారు. శివ కార్తికేయన్ నిర్మాతగా రాధిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం తాయ్ కిలవి అనే సినిమాతో నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక శివ కార్తికేయన్ చివరిగా పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సంఘటన శివ కార్తికేయన్ యొక్క గొప్ప మనసును తెలియజేస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా ఆయన నిజమైన హీరో అని నిరూపించుకున్నారు. అతని దాతృత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.


