|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల పారితోషికంపై సంచలనం! ‘ఉస్తాద్’ కోసం ఆమె తీసుకున్న మొత్తం తెలిస్తే షాక్ అవుతారు!

Published: 15-03-2026, 3:05 AM
శ్రీలీల పారితోషికంపై సంచలనం! ‘ఉస్తాద్’ కోసం ఆమె తీసుకున్న మొత్తం తెలిస్తే షాక్ అవుతారు!
  • శ్రీలీల టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తోంది.
  • ఈ సినిమా కోసం శ్రీలీల రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.
  • శ్రీలీల ‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ స్త్రీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా స్టార్ హీరోలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఈమె ఎన్ని సినిమాలు చేసినా కూడా అన్నిట్లో ఏ ఒక్కటి కూడా మీకు స్టార్ ఇమేజ్ ని అందివ్వలేదు. కానీ వరుసగా సినిమాలు అయితే చేస్తూ వస్తుంది. సినిమాల హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే వసూల్ చేస్తుందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగానే తీసుకుంటుందని టాక్. మరి ఆ మూవీకి ఎంత తీసుకుంటుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

శ్రీలీల రెమ్యూనరేషన్ గురించిన వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కు జోడిగా హీరోయిన్ శ్రీలీల నటిస్తుందన్న విషయం తెలిసిందే.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటుగా తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఈనెల ఉగాది కానుకగా 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించాలని ఎంతో మంది హీరోయిన్లు కోరుకుంటారు. అలాంటి అవకాశం యంగ్ బ్యూటీ శ్రీలీలకు దక్కింది.. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీకి మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈమె ఇంత తీసుకోవడంపై సోషల్ మీడియాలో వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది..

టాలీవుడ్‌లో శ్రీలీల ప్రయాణం

పెళ్లి సందడి అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఆ మూవీ సాలిడ్ హిట్ అందుకోకపోయినా సరే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.. చిన్న హీరోలతో సినిమాలు చేయడం మాత్రమే కాదు స్టార్ హీరోల సరసన కూడా హీరోయిన్గా నటించడంతో ఆమెకు క్రేజీ ఆఫర్లు అందుతున్నాయి. రామ్‌, నితిన్‌ లాంటి యంగ్‌ హీరోలతో పాటు మహేశ్‌ బాబు లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నా సరే అటు బాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వచ్చింది. అక్కడ కూడా క్రేజీ హీరోయిన్ గా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

శ్రీలీల పారితోషికం గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.