|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ ఖూనీ: పెర్ఫెక్షన్ పేరుతో స్టార్ హీరోల విధ్వంసం!

Published: 15-04-2026, 11:05 PM
టాలీవుడ్ ఖూనీ: పెర్ఫెక్షన్ పేరుతో స్టార్ హీరోల విధ్వంసం!
  • పెద్ద హీరోలు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చిన్న సినిమాలు నిలిచిపోతున్నాయి.
  • హీరోల పారితోషికాల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు.
  • OTTలకు అలవాటు పడుతున్న ప్రేక్షకులు, థియేటర్లకు దూరం అవుతున్నారు.
  • హాలీవుడ్ తక్కువ సమయంలోనే భారీ సినిమాలు తీస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు పెర్ఫెక్షన్ పేరుతో ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల పరిశ్రమ ఆర్థికంగా నష్టపోతోంది. దీని కారణంగా చిన్న నిర్మాతలు నష్టపోవడమే కాకుండా థియేటర్లు కూడా కళావిహీనంగా మారుతున్నాయి.

హీరోల సమయం, నిర్మాతల నష్టం

Tollywood Crisis: ప్యాన్ ఇండియా సినిమాలు..వేల కోట్ల వసూళ్లు ..వరల్డ్ వైడ్ గా గుర్తింపు..చూడ్డానికి అంతా బానే ఉంటుంది.కానీ ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్ ఫైనాన్షియల్ సిస్టం తలాకుతలం అయిపోతుంది.మన టాప్ హీరోలు కళా ఖండం తీస్తున్నామనే భ్రమలో ఒక్కో సినిమాకు ఐదేళ్లు కేటాయించడం, టాలీవుడ్ మనుగడకే ముప్పులా మారిపోతుంది.ఒకరకంగా చెప్పాలంటే ఇది పెర్ఫెక్షన్ కాదు.. పక్కా ప్లానింగ్ లేని తీరు.

ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే

ఎవరెన్ని చెప్పినా అంతిమంగా సినిమా అంటే ఫక్తు బిజినెస్ .ఇక్కడ మనీ సర్క్యులేషన్ చాలా ముఖ్యం.సో ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే, ఆ వందల కోట్ల పెట్టుబడి మళ్ళీ మార్కెట్ లోకి వచ్చి మరో పది చిన్న సినిమాలకు పెట్టుబడిగా మారుతుందనేది వాస్తవం.కానీ మన హీరోలు మూడేళ్లకో సినిమా కాని వదలని పరిస్థితి.అలెక్కన డబ్బు మళ్ళీ సినిమాలోకి వచ్చి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఈజీగా నాలుగైదు ఏళ్ళు పడతాయ్. అంటే చాలా చిన్న సినిమాలు ఫండింగ్ లేక ఆగిపోతాయన్న మాట.

కలెక్షన్లు కేవలం వడ్డీలు కట్టడానికే

OTT ప్రభావం: థియేటర్ల పరిస్థితి

ఇక నిర్మాతలకి తరబడి వడ్డీల భారం పెరుగుతూనే ఉంటుంది. సూపర్ హిట్ అయినా, ఆ వచ్చిన కలెక్షన్లు కేవలం వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయన్నది జగమెరిగిన సత్యం.ఎటొచ్చిహీరోలు తమ రెమ్యూనరేషన్ జేబులో వేసుకుని సేఫ్ అవుతున్నారు కానీ, వారి వల్ల నిర్మాతలు రోడ్డున పడుతున్నారనేది కాదనలేని సత్యం.స్టార్ హీరోల సినిమా వస్తేనే థియేటర్ల దగ్గర సందడి ఉంటుంది ఎవరూ కాదనలేరు.పైగా ఏడాది పొడుగునా చిన్న సినిమాలతో డీలా పడ్డ ఎగ్జిబిటర్లు, తమ ఆశలన్నీ అగ్ర హీరోలపైనే పెట్టుకుంటారు కూడా .

ఫలితంగా ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు

కానీ మన స్టార్లు షూటింగ్ల పేరుతో ఏళ్ల తరబడి గ్యాప్ ఇస్తుండటంతో థియేటర్లు కళ తప్పుతున్నాయి. ఫలితంగా ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు అయిపోతున్నారు. ఇంట్లోనే కొత్త కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు ఇక థియేటర్ మొహమే చూడటం మానేశాడు.ఈ స్టార్ల ఈ ‘గ్యాప్’ వల్ల థియేటర్లపై ఆధారపడ్డ వేలాది మంది వర్కర్స్ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి.

హాలీవుడ్ vs టాలీవుడ్: నిర్మాణ వ్యత్యాసాలు

అంతు చిక్కని బేతాళ ప్రశ్న.

ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చూసిన సినీ ప్రేమికులు , ఇప్పుడు తమ హీరో ముఖాన్ని వెండితెరపై చూడటానికి మూడేళ్లు వేచి చూడాల్సి వస్తోంది. హాలీవుడ్ వంటి పరిశ్రమల్లో భారీ విజువల్స్ ఉన్న సినిమాలను కూడా పక్కా షెడ్యూల్‌తో ఏడాదిన్నరలో పూర్తి చేస్తున్నారు. మరి మన స్టార్లకు ఎందుకింత టైమ్ అన్నది అంతు చిక్కని బేతాళ ప్రశ్న. హీరోలు తమ క్రేజ్ పెరుగుతోందని అనుకుంటున్నారు కానీ, వాస్తవానికి ఆ గ్యాప్ లో కొత్త టాలెంట్ రావడంతో వీరి బ్రాండ్ వాల్యూ పడిపోతుందన్న విషయం మర్చిపోతున్నారు.సినిమాని సెట్స్ మీద పెట్టేసి డిబేట్లు పెట్టడం కన్నా పక్కాగా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే మంచిది కూడా.సినిమా బాగుండాలనే ఆశ ఉండొచ్చు.కానీ అది ఇండస్ట్రీని నాశనం చేసేలా ఉండకూడదు కదా. స్టార్ హీరోలూ ఇకనైనా కాస్త సినిమాలు త్వరగా వదులుతారు కదూ !

పెద్ద హీరోలు తమ పద్ధతి మార్చుకుని, సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేస్తేనే టాలీవుడ్ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుంది. లేకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.