
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో విద్యాబాలన్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
రజినీకాంత్, విద్యాబాలన్ జంటగా నటించే అవకాశం!
‘జైలర్-2’లో విద్యాబాలన్ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు
ఈ కాంబో సినిమాకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు
త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
జైలర్-2 లో విద్యాబాలన్?
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘జైలర్-2’(Jailer-2) ఒకటి. ఇక ఇది సూపర్ హిట్ అయిన ‘జైలర్’(Jailer) మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్(Nelson Dilip) దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. కాగా ఈ మూవీకు అనిరుద్(Anirudh) సంగీతం అందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే జైలర్-2లో బాలకృష్ణ పాత్ర 20 నిమిషాలు ఉంటుందని క్యూరియాసిటీ పెరుగుతున్న క్రమంలో ఈ
మూవీకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. జైలర్ 1 చిత్రంలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణగా నటించిన సంగతి తెలిసిందే. అయితే జైలర్-2లో మాత్రం విద్యాబాలన్(Vidhyabalan)టించింది. ఇక ఇప్పుడు రజినీకాంత్ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ రాబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఫ్యాన్స్ ఈ క్రేజీ కాంబోలో మూవీ అంటే బొమ్మ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రజినీకాంత్ – విద్యాబాలన్ కాంబినేషన్
అభిమానుల ఆసక్తికర వ్యాఖ్యలు
రజినీకాంత్ మరియు విద్యాబాలన్ ల కాంబినేషన్ సినిమా అభిమానులను ఆకట్టుకునే అంశంగా మారింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.


