|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ఫ్యాన్స్ పై సుధా కొంగర సంచలన ఆరోపణలు! ఇంత జరుగుతోందా?

Published: 14-01-2026, 5:00 AM
విజయ్ ఫ్యాన్స్ పై సుధా కొంగర సంచలన ఆరోపణలు! ఇంత జరుగుతోందా?
  • దర్శకురాలు సుధా కొంగర విజయ్ అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • విజయ్ అభిమానులు తమ సినిమాను టార్గెట్ చేస్తున్నారని సుధా ఆరోపించారు.
  • విజయ్ సినిమా వాయిదా పడటం పరాశక్తికి కలిసొచ్చిన అంశమని సుధా అన్నారు.
  • విజయ్ ఫ్యాన్స్ రౌడీయిజంతో పోరాడుతున్నామని సుధా కొంగర తెలిపారు.

ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర హీరో విజయ్ అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ అభిమానులే తన సినిమాను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

సుధా కొంగర షాకింగ్ కామెంట్స్

Sudha Kongara: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళాదర్శకురాలిగా కొనసాగుతున్న వారిలో సుధా కొంగర ఒకరు. ఈమె దర్శకత్వంలో ఇప్పటివరకు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా నటించిన పరాశక్తి (Parasakthi)సినిమా కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ ఉద్యమ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అవంతరాలను దాటుకొని సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కాకుండా మిశ్రమ స్పందన లభించింది.

ఇక ఈ సినిమాకు పోటీగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్(Vijay) దళపతి సినిమా జననాయగన్ (Jananayagan)సినిమా కూడా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని పలువురు భావించారు అయితే ఉన్నఫలంగా విజయ్ సినిమా వాయిదా పడటంతో పరాశక్తి సినిమాకు కలిసొచ్చిన అంశమే అయినప్పటికీ కొంతమంది విజయ్ అభిమానులు ఈ సినిమాని టార్గెట్ చేశారు అంటూ సుధా కొంగర తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా సుధా కొంగర మాట్లాడుతూ తమ సినిమాపై ఉద్దేశపూర్వకంగానే ఒక హీరో అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడారు.

విజయ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారా?

ఇక ఈ కార్యక్రమంలో సుధాకర్ కొంగర హీరో విజయ్ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయిన,సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన హీరో సినిమా అంటూ సుధా కొంగర మాట్లాడటంతో ఈమె విజయ్ గురించే మాట్లాడారని స్పష్టమవుతుంది. కచ్చితంగా ఆమె హీరో విజయ్ అభిమానులను ఉద్దేశించే మాట్లాడారని తెలుస్తోంది. . ప్రస్తుతం మేము ఆ హీరో అభిమానుల రౌడీయిజంతో పోరాటం చేస్తున్నామని తెలిపారు. అభిమానులు చేసిన తప్పుల వల్లే వారి హీరో సినిమా ఆగిపోయింది.

ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం కారణంగా తమ సినిమా ఇబ్బందుల్లో పడుతుందని సుధా తెలియజేశారు. ఈ రౌడీయిజానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని సుధా కొంగర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటంతో విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధా కొంగర ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి మాటలు మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సుధా కొంగర వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అనే విధంగా వివాదం నడుస్తుంది. హీరో విజయ్ అభిమానులను రౌడీలతో పోల్చి సుధా మాట్లాడటంతో ఇది చాలా దారుణమని ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో దుమారం!

సుధా కొంగర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.