
📌 Key Points
- సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గోట్ సినిమా షూటింగ్ మూడేళ్లుగా సాగుతోంది.
- గోట్ సినిమా ప్రమోషన్స్‌లో సుధీర్ సహకరించడం లేదని, డబ్బింగ్ కూడా చెప్పలేదని ఆరోపణలున్నాయి.
- నూతన సంవత్సర పోస్టర్‌లో నిర్మాతలు సీనియర్ ఎన్టీఆర్ నిబద్ధతను ప్రస్తావించారు.
- నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్‌ను సుడిగాలి సుధీర్‌కు పరోక్ష వార్నింగ్‌గా ఇండస్ట్రీ భావిస్తోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గోట్ సినిమా నిర్మాతలకు కష్టాలు తెచ్చిపెట్టింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లలో సుధీర్ సహకరించడం లేదని, డబ్బింగ్ కూడా చెప్పలేదని ఆరోపణలున్నాయి. దీంతో నిర్మాతలు ఎన్టీఆర్ గొప్పదనాన్ని ప్రస్తావిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇది సుధీర్‌కు పరోక్ష వార్నింగ్‌గా మారిందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా ఎదుర్కొంటున్న సవాళ్లు
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ చాలా మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ అనే కామెడీ షోతో పాపులర్ అయిన సుధీర్‌కు ఓ హీరోకు ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే.. ఆయన హీరో అయ్యాడు. ఫలితాలు ఎలా ఉన్నా… వరుసగా అయితే సినిమాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు హైలెస్సా అనే సినిమా చేస్తున్నాడు. దీని కంటే ముందు… గోట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి… ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది.
ఈ గోట్ సినిమాను 2023లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2026 వచ్చింది. మూడేళ్ల పాటు చేయాల్సినంత పెద్ద సినిమేం కాదు ఇది. అయినా.. ఎందుకు లేట్ అయిందంటే… కారణం దీనికి డైరెక్టర్‌గా పని చేసిన నరేష్ కుప్పిలి వైపు వేళ్లు చూపిస్తారు మూవీ యూనిట్… నిర్మాతలు.
ఇవి అన్ని పక్కన పెడితే.. 2026 న్యూ ఇయర్ సందర్భంగా నిర్మాతలు విష్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విషింగ్ పోస్టర్ నార్మలే.. కానీ, అందులో ఉన్న టాపిక్ మాత్రం… ఆ గోట్ మూవీ హీరో సుడిగాలి సుధీర్ కోసమే రాసినట్టు ఉందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సుధీర్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేలా ఉందని అంటున్నారు.
అంతలా ఆ పోస్టర్ లో ఏం ఉందంటే… జనరల్ టాపిక్ చెబుతున్నట్టు సీనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పారు. నిర్మాతలు కష్టాల్లో ఉంటే అండగా నిలిచే హీరో ఎన్టీఆర్ అని… ఆయన కీర్తి కోసమో.. తన కంఫట్స్ కోసమో సినిమాలు చేయలేదని… సినిమాను, నిర్మాతను కాపాడే విధంగా సినిమాలు చేశాడు అని రాశారు. నిర్మాతలకు ఫైనాన్సియల్ ఇబ్బందులు ఉంటే.. హీరో రాత్రులు కూడా పని చేసేవాడని, సరైన టైంకి సినిమా పూర్తి అయ్యేలా కృషి చేసే వాడని చెప్పుకొచ్చారు.
గోట్ సినిమా వివాదాలు: జాప్యం వెనుక అసలు కథ
ఇప్పుడు దీని గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే.. గోట్ సినిమాను డైరెక్టర్ లేకుండానే నిర్మాత షూటింగ్ పూర్తి అయితే చేశాడు. కానీ, ఇప్పుడు హీరో సుడిగాలి సుధీర్ మాత్రం ప్రమోషన్స్ కి రావడం లేదు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో హీరో పాత్రకు అసలు డబ్బింగే చెప్పలేదు. అంటే.. సుధీర్ తన పాత్రకు కనీసం డబ్బింగ్ చెప్పడానికి కూడా రెడీ లేడా అనే మాటలు ఇండస్ట్రీలో వినిపించాయి.
ఇలాంటివి నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు కాబట్టే… న్యూ ఇయర్ విషెస్ పోస్టర్ లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ… తమ బాధను వెల్లడిస్తూ… సుడిగాలి సుధీర్‌కు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఇప్పటికే గోట్ మూవీ నిర్మాత… ప్రెస్ మీట్ సుడిగాలి సుధీర్ తమ సినిమాను వదిలేశాడని, ప్రమోషన్స్ కు రావడం లేదని… తాము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నామంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
In Telugu cinema’s golden era, #NTR wasn’t just an actor.. he was a ‘Guardian’.
నిర్మాతల పరోక్ష వార్నింగ్: ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు?
He worked through nights, finished on time, and ensured producers never fell into debt.
He didn’t act for fame. He acted to protect cinema. #NandamuriTarakaRamarao – The true G.O.A.T of Telugu… pic.twitter.com/0agX7QmrkW
— Mahaateja Creations (@MahatejaC) January 1, 2026
గోట్ సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్న కష్టాలు, సుడిగాలి సుధీర్ తీరుపై ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ ఆదర్శాన్ని ప్రస్తావిస్తూ ఇచ్చిన ఈ పరోక్ష వార్నింగ్ సుధీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది నటుల నిబద్ధతపై కొత్త చర్చకు దారితీసింది.


