
📌 Key Points
- నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’లోని ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్, రికార్డ్ వ్యూస్!
- రామ్ చరణ్, బుచ్చిబాబు సన ‘పెద్ది’ నుంచి ‘రయ్ రయ్ రారా’ పాట యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.
- నాగ చైతన్య, కార్తీక్ దండు ‘వృషకర్మ’ టీజర్ విడుదల, విజువల్స్‌తో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్!
- సుకుమార్ శిష్యులు టాలీవుడ్‌లో కంటెంట్ పరంగా ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, అంచనాలు పెంచేస్తున్నారు.
టాలీవుడ్ లో సుకుమార్ మార్క్ కనబడుతోంది! ఆయన శిష్యులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సన, కార్తీక్ దండు తమ సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. వారి లేటెస్ట్ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి.
శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ సాంగ్ సెన్సేషన్!
Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కంటెంట్ అండ్ కమర్షియల్ సినిమాలు చేయడంలో ఆయన టాప్. అయితే, కేవలం సుకుమార్ మాత్రమే కాదు ఇప్పుడు ఆయన శిష్యులు కూడా కంటెంట్ తో కుమ్మేస్తున్నారు. ఒకరు కాదు ఏకంగా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ముగ్గురు దర్శకుడు తన లేటెస్ట్ సినిమాలతో ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ముగ్గురు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. రీసెంట్ గా ఈ ముగ్గురు దర్శకుల సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ రికార్డ్ వ్యూస్ సాధిస్తూ తమ తమ సినిమాలపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వాటిలో ముందుగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేస్తున్న (Tollywood)ది పారడైజ్ సినిమా గురించి చెప్పుకోవాలి. నాని హీరోగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఆయా షేర్ అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది అనే చెప్పాలి. అనిరుద్ అందించిన మ్యూజిక్ కి శ్రీకాంత్ టేకింగ్ నెక్స్ట్ లెవల్ ల్లో వర్క్అవుట్ అయ్యింది.
బుచ్చిబాబు ‘పెద్ది’ నుంచి రయ్ రయ్ రారా రికార్డ్స్!
దాంతో, నెట్టింట ఎక్కడ చూసిన ఈ సాంగ్ గురించే చర్చ నడుస్తోంది. ఇక, ఆ తరువాత వచ్చిన అప్డేట్ దర్శకుడు బుచ్చిబాబు సన నుంచి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రయ్ రయ్ రారా అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ లెవల్లో వ్యూస్ సాధిస్తోంది. మొటివేషనల్ లిరిక్స్ తో వచ్చిన ఈ పాటలో చరణ్ చేసిన డాన్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
కార్తీక్ దండు ‘వృషకర్మ’ టీజర్ విధ్వంసం!
ఇక మరో దర్శకుడు కార్తీక్ దండు. ఈ దర్శకుడు అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్న సినిమా వృషకర్మ. పీరియాడికల్ హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో చూపించిన విజువల్స్ కి ఆడియన్ మైండ్ బ్లాంక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదిరిపోయే కంటెంట్ వచ్చిన ఈ టీజర్ వృషకర్మ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. అలా ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ ముగ్గురు దర్శకుల నుంచి వచ్చిన కంటెంట్ మాత్రమే కనిపిస్తోంది. ఆ విషయంలో సుకుమార్ శిష్యులా మాజాకా అనే లెవల్లో దుమ్ములేపుతున్నారు ఈ దర్శకులు. మరి ఈ మూడు సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


