|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య 46లో ఊహించని ట్విస్ట్: స్టార్ హీరో క్యామియో, వెంకీ అట్లూరి సంచలన నిర్ణయం!

Published: 03-01-2026, 6:30 AM
సూర్య 46లో ఊహించని ట్విస్ట్: స్టార్ హీరో క్యామియో, వెంకీ అట్లూరి సంచలన నిర్ణయం!
  • సూర్య 46 చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
  • ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కీలక క్యామియో పాత్రలో కనిపించనున్నారు.
  • “విశ్వనాథన్ అండ్ సన్స్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
  • దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి గతంలో “లక్కీ భాస్కర్”కు కలిసి పనిచేశారు.

సూర్య 46 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో క్యామియో పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ వార్త సూర్య అభిమానులలో ఆసక్తి రేపుతోంది.

సూర్య 46 సినిమా వివరాలు

Suriya 46 Film: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సూర్య(Suriya)కు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య సినిమాలు తెలుగులో విడుదల అవుతూ ఇక్కడ కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఇక సూర్య సినిమా విడుదల ఉందంటే చాలు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇలా తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న సూర్య ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులతో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేసిన సంగతి తెలిసిందే.

సూర్య 46 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు “విశ్వనాథన్ అండ్ సన్స్”(Vishwanthan and Son’s) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో సూర్యకు జోడిగా నటి మమిత బైజు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయి మధ్య ప్రేమ కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

దుల్కర్ సల్మాన్ క్యామియోపై ఆసక్తికర చర్చ

ఇటీవల కాలంలో ఒక సినిమాలో స్టార్ హీరోలు క్యామియో పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సూర్య 46 సినిమాలో కూడా మరొక స్టార్ హీరో క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడుగా మంచి సక్సెస్ అందుకున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కు తెలుగులో ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా తెలుగు తమిళ భాషలలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న దుల్కర్ సూర్య సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి దుల్కర్ క్యామియో గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

జిత్తు మాధవన్ డైరెక్షన్లో సూర్య..

వెంకీ అట్లూరి ప్లానింగ్ వెనుక రహస్యం

ఇక దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెంకీ అట్లూరి సూర్య సినిమాలో క్యామియో కోసం అడగగా వెంటనే దుల్కర్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక సూర్య వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మలయాళ స్టార్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

సూర్య 46 చిత్రంలో దుల్కర్ సల్మాన్ క్యామియో వార్త సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి ప్లానింగ్ వెనుక పెద్ద కారణం ఉందని స్పష్టమవుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడితే, అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.