
📌 Key Points
- సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను నిర్మించారు.
- ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
- సుస్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కోసం కొత్త ఆఫీస్ ప్రారంభించారు.
- రామ్ చరణ్ తో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని సుస్మిత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా రాణిస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విజయం తర్వాత, ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొత్త ఆఫీస్ ను ప్రారంభించారు. రామ్ చరణ్ తో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నూతన ఆరంభం
Susmitha Konidela: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకోగా, మెగా అమ్మాయిలు కూడా నిర్మాతలుగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే నిహారిక నిర్మాతగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మెగా డాటర్ సుస్మిత కొణిదెల(Susmitha Konidela) సైతం నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో సుస్మిత కొణిదెల అభిమానులకు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు. సుస్మిత మన శంకర వరప్రసాద్ గారు సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈమె మరిన్ని సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కి సంబంధించి మరో కొత్త ఆఫీస్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ఈమె షేర్ చేస్తూ “న్యూ చాప్టర్ బిగిన్స్” అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాగే మంచి సినిమాలను చేసి మరింత సక్సెస్ అందుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సుస్మిత తదుపరి ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తానని చరణ్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అని తెలియచేసారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలెబ్రేషన్స్
A new chapter begins for us at Gold Box Entertainments ✨
After the blockbuster beginning in this 2026 with #ManaShankaraVaraprasadGaru , today we step into our new office with gratitude, belief, and renewed passion 🙏🏻❤️🔥
Onwards to bigger stories and brighter milestones 🤗🤗🤗… pic.twitter.com/c27GEDD25u
రామ్ చరణ్ తో సినిమాపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు
— Gold Box Entertainments (@GoldBoxEnt) January 23, 2026
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ పూర్తి అయిన అనంతరమే సుస్మితతో చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సుస్మిత నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఈమె చరణ్ రంగస్థలం సినిమాతో పాటు చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య వంటి సినిమాలకు కాస్టింగ్ డిజైనర్ గా పనిచేశారు. ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతున్న సుస్మిత ఏకంగా నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి సుస్మిత కొణిదెల తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మరిన్ని మంచి చిత్రాలు అందించాలని చూస్తున్నారు. రామ్ చరణ్ తో ఆమె సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.


