
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ప్రోమో ఇప్పటికే విడుదలైంది. జూన్ 17న పూర్తి పాట విడుదల కానుంది. జూలై 4న సినిమా గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది.
Key Points
నితిన్ నటించిన 'తమ్ముడు' చిత్రం జూలై 4న విడుదల.
సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల.
జూన్ 17 సాయంత్రం 5 గంటలకు పూర్తి పాట విడుదల.
విడుదలకు ముందు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తమ్ముడు చిత్రం లిరికల్ సాంగ్ ప్రోమో
హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే పనిలో పడ్డాడు టాలీవుడ్ హీరో నితిన్. తాజాగా ఈ హీరో తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా ఎలాగైనా హిట్ టాక్ సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక విడుదలకు ముందే ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా రేపు (జూన్ 17) సాయంత్రం 5 గంటలకు తమ్ముడు సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సాంగ్ ప్రోమోను వదిలారు మేకర్స్. ఇక ఈ సినిమా జూలై 4 న థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ప్రోమో సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. instagram link
జూలై 4న థియేటర్లలో విడుదల
నితిన్ నటనకు మంచి ఆదరణ
తమ్ముడు చిత్రం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 4న విడుదలయ్యే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


