
📌 Key Points
- దర్శకుడు మారుతి ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకలో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
- ప్రభాస్ నటన చూసి, సినిమా కోసం ఆయన పడిన కష్టాన్ని తలచుకొని మారుతి ఏడ్చారు.
- ప్రభాస్ వేదికపైకి వచ్చి మారుతిని ఓదార్చి, మూడు సంవత్సరాల కష్టాన్ని గుర్తుచేశారు.
- ‘ది రాజా సాబ్’ నిరాశపరిస్తే తన ఇంటికి వచ్చి ప్రశ్నించవచ్చని ప్రభాస్ హామీ ఇచ్చారు.
ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్ ఆయన్ని ఓదార్చడమే కాకుండా, సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మారుతి మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చిందని ప్రభాస్ అన్నారు.
మారుతి ప్రస్థానం: కన్నీళ్లకు కారణం
The Raja Saab Pre release: ఈ రోజుల్లో వంటి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన మారుతి అనంతరం బస్ స్టాప్ ,ప్రేమ కథ చిత్రం వంటి తదితర సినిమాల ద్వారా దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా డైరెక్టర్ గా అంచలంచెలుగా ఎదుగుతూ నేడు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని మారుతి సొంతం చేసుకున్నారు. మారుతి డైరెక్షన్లో హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది రాజా సాబ్.
ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అయితే దర్శకుడు మారుతి(Maruthi) ఈ కార్యక్రమంలో కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం తనకు ప్రభాస్ నుంచి ఆది పురుష్ సినిమా సమయంలో ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సరిగా ఆయన రాముడు వేషంలో ఉన్నప్పుడు ఈ మారుతి తనని కలిసారని తెలియజేశారు. ఇలా మా పరిచయం అక్కడ మొదలైందని , ప్రభాస్ గారి లాంటి స్టార్ హీరోతో మంచి సినిమా చేయాలన్న నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు.
ప్రభాస్ ఇచ్చిన ధైర్యం, ఆ మాటలు
ప్రభాస్ లాంటి హీరోతో ఆషామాషీ సినిమా చేయలేదు ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రీ రికార్డింగ్ సమయంలో ఒక్కొక్క సీన్ చూస్తున్నప్పుడు నిజంగానే ఈ సినిమా నేను చేశానా అనే భావన నాకు కలిగిందని, అది చూస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ గారి నటన చూసి బాగా ఏడ్చానని మారుతి తెలియజేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రాణం పెట్టి చేశారు. ప్రభాస్ గారికి తాను చాలా రుణపడి ఉన్నాను అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సాధారణంగా ఎవరైనా చనిపోయిన కూడా నాకు కన్నీళ్లు రావు కానీ ఇలా మీరు ఎదురుగా కూర్చుని ఉంటే కన్నీళ్లు ఆగడం లేదని తనని తాను కంట్రోల్ చేసుకున్నారు. అదే సమయంలోనే ప్రభాస్ వేదికపైకి వెళ్లి తనని సముదాయించారు. మారుతి మూడు సంవత్సరాల కష్టం ఇలా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చిందని ప్రభాస్ తెలియజేశారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయదని ఒకవేళ డిసప్పాయింట్ చేస్తే మీరు నేరుగా మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నించొచ్చు అంటూ ఈయన వేదిక పైన తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చారు . ఇలా ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ మారుతి చేసిన కామెంట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసింది.
ది రాజా సాబ్ విజయంపై ప్రభాస్ హామీ
ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో మారుతి, ప్రభాస్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ భావోద్వేగ ఘట్టం సినిమాపై అంచనాలను పెంచింది. వారి కృషి సినిమా విజయాన్ని నిర్ధారించాలని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వాలని ఆశిద్దాం.


