|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ది రాజాసాబ్: 3 గంటల 9 నిమిషాల సినిమా.. U/A సర్టిఫికెట్‌తో ప్రభాస్ వస్తున్నాడు!

Published: 06-01-2026, 4:00 AM
ది రాజాసాబ్: 3 గంటల 9 నిమిషాల సినిమా.. U/A సర్టిఫికెట్‌తో ప్రభాస్ వస్తున్నాడు!
  • ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది.
  • ఈ సినిమా రన్ టైమ్ 189 నిమిషాలు (3 గంటల 9 నిమిషాలు) గా లాక్ అయింది.
  • సెన్సార్ సభ్యులు కేవలం 4 సెకన్ల సీన్ మార్చాలని సూచించారు, పెద్ద కట్స్ లేవు.
  • హారర్ కామెడీ రొమాంటిక్ నేపథ్యంలో జనవరి 9న సంక్రాంతికి సినిమా విడుదల.

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 3 గంటల 9 నిమిషాల భారీ రన్ టైమ్‌తో జనవరి 9న సంక్రాంతికి విడుదల కానుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ది రాజాసాబ్: సెన్సార్ రిపోర్ట్, U/A సర్టిఫికెట్

The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తొలిసారి తన సినీ కెరియర్లో హారర్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న చిత్రం ది రాజాసాబ్. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి(Maruthi )దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మాళవిక మోహనన్ , రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ , బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్లు, పోస్టర్లు , గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీనికి తోడు ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు అనే విషయాన్ని కూడా ఇటీవల సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని సినిమాపై అంచనాలు పెంచేశారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. హారర్ కామెడీ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ ఏ (U/A) సర్టిఫికెట్ ను జారీ చేశారు . అంటే ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ సినిమా చూడడానికి అర్హులు అని సెన్సార్ స్పష్టం చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి 189 నిమిషాలతో రన్ టైం లాక్ చేశారు. అంటే 03:09 గంటల నిడివితో థియేటర్లలో జనవరి 9న రాబోతోంది.. సాధారణంగా 2 1/2 గంటలు అంటేనే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష లాంటిది. అలాంటిది మూడు గంటల పాటు ఈ సినిమా నిడివి ఉండబోతుందని తెలిసి అసలు అంతసేపు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కథపై అటు సెన్సార్ కట్స్ కూడా ఏమీ లేకపోవడం గమనార్హం. కేవలం నాలుగు సెకండ్ల సీన్ మాత్రమే మార్చివేయాలని సెన్సార్ సభ్యులు సూచించారు. దీన్ని బట్టి చూస్తే మారుతి ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారో అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ సినిమా విడుదల అయితే కచ్చితంగా 300 కోట్లు మినిమం గ్యారంటీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

రన్ టైమ్ లాక్: 3 గంటల నిడివితో వస్తున్న రాజాసాబ్!

ఇకపోతే ఈ సంక్రాంతి బరిలో ది రాజాసాబ్ సినిమాతో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి , నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. ఇక అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలే కావడం గమనార్హం. మరి ఈ సంక్రాంతి బరిలో ఎవరు నెగ్గుతారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

#TheRajaSaab Censor Complete… 🔥🔥🔥

సంక్రాంతి రేసులో రాజాసాబ్: అంచనాలు, పోటీ

U/A – 3 Hrs 09 Mins – RunTime #TheRajaSaabOnJan9th #Prabhas #TheRajaSaab #Rajasaab #NidhhiAgerwal #MalavikaMohanan #Prabhas𓃵 #Tollywood #tollywoodactress #entertainment #Bigtv #Bigtvcinema pic.twitter.com/dLoBnElXyA

— BIG TV Cinema (@BigtvCinema) January 6, 2026

మొత్తం మీద ‘ది రాజాసాబ్’ సెన్సార్, రన్ టైమ్ వివరాలు సినిమాపై ఉత్సుకతను పెంచాయి. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.