
📌 Key Points
- 2025లో ఏ ఒక్క టాలీవుడ్ సినిమా కూడా 500 కోట్ల మార్కును దాటలేదు.
- బాలీవుడ్, కోలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల నుంచి అనేక చిత్రాలు ఈ మార్కును దాటాయి.
- కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేసింది.
- కూలీ (580 కోట్లు), సైయారా (570 కోట్లు), ఛావా (807 కోట్లు) ఈ జాబితాలో నిలిచాయి.
2025లో టాలీవుడ్ సినీ పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ ఏడాది ఏ ఒక్క తెలుగు సినిమా కూడా 500 కోట్ల మార్కును అందుకోలేదు. బాలీవుడ్, కోలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల సినిమాలు భారీ వసూళ్లతో సత్తా చాటాయి. ఆ 500 కోట్ల చిత్రాల జాబితా ఇక్కడ.
టాలీవుడ్‌కు తప్పని నిరాశ: 500 కోట్ల మార్క్ అందుకోలేకపోయింది
Year End 2025 : ప్రతి ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేలా కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి.. కొన్ని సినిమాలు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి అన్ని ఏరియాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. అయితే 2024 తో పోలిస్తే 2025లో ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు మించి వసూలు చేయలేదు. మిగిలిన ఇండస్ట్రీలోని సినిమాలతో పోలిస్తే తెలుగులో ఒక్క సినిమా కూడా 500 కోట్ల మార్క్ ను దాటలేదు. ఒక తెలుగు తప్ప మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో దాదాపు రెండు మూడు సినిమాలు 500 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డుని సృష్టించాయి. డిసెంబర్ నెల మరికొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో ఇండియాలో రిలీజ్ అయిన ఐదు వందల కోట్ల సినిమాల లిస్టు బయటకొచ్చింది.. ఆ లిస్టు ప్రకారం ఏ ఏ సినిమాలు ఏడాది 500 కోట్ల వసూళ్లను అందుకున్నాయో ఒకసారి చూసేద్దాం..
2025 సినిమాలకు బాగా కలిసి వచ్చింది. పెద్దా,చిన్న తేడా లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. అది ఏకంగా ఐదు సినిమాలు ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..
ఇతర ఇండస్ట్రీల సత్తా: 2025లో 500 కోట్ల సినిమాలు
ఏడాది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసిన వాటిలో బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలోని సినిమాలు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 2, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన కన్నడ హీరో రిషబ్ శెట్టి మూవీ కాంతారా చాప్టర్ 1 పాజిటివ్ టాక్ ని అందుకోవడం తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల వసూళ్ళ మార్క్ ను దాటేసింది.. అలాగే జైలర్ తరువాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తలైవా నటించిన సినిమా కూలీ. అన్ని భాషల్లో కలుపుకుని కూలీ సినిమా 580 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే.. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే కొత్త హీరో, హీరోయిన్లు నటించిన సూపర్ హిట్ మూవీ సైయారా.. ప్రపంచ వ్యాప్తంగా 570 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది మూవీ. ఈ ఏడాది బాలీవుడ్ కు ఊపిరిపోసింది ఛావా సినిమా. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న రిలీజ్ అయింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో నటించారు.. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.. ప్రపంచవ్యాప్తంగా 807.91 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ను సాధించింది ఛావా.. ఇక చివరగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ చిత్రం దురంధర్.. ఈ మూవీ డిసెంబర్ 11న థియేటర్లలోకి వచ్చింది. పది రోజుల్లోనే దాదాపు 500 కోట్లకు పైగా వసూలను సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుని నెలకొల్పింది..
బాలీవుడ్, కోలీవుడ్ రికార్డులు: కాంతార, కూలీ, ఛావా కలెక్షన్స్
ప్రతి ఇండస్ట్రీలోని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచన్న విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. కానీ తెలుగులో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు లో ఏ ఒక్కటి కూడా 500 కోట్లకు పైగా వసూలను రాబట్టలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా కేవలం 300 కోట్లకు పైగానే వసూళ్ల ను అందుకున్నాయి.. గత ఏడాది పుష్ప 2, కల్కి వంటి చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా 500 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాయి. ఏడాది మాత్రం తెలుగులో ఒక్క సినిమా కూడా రాకపోవడంతో తెలుగు అభిమానులు నిరాశాను వ్యక్తం చేస్తున్నారు.. మరి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుంది? 1000 కోట్ల క్లబ్లోకి రెండు సినిమాలైనా వెళ్తాయేమో చూడాలి…
మొత్తంగా, 2025 టాలీవుడ్‌కు నిరాశనే మిగిల్చింది. ఏ ఒక్క తెలుగు సినిమా 500 కోట్ల మార్కును అందుకోలేదు. బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లతో సత్తా చాటి, తెలుగు సినిమాకు ఒక సవాల్ విసిరాయి.


