
📌 Key Points
- టాలీవుడ్ మేకర్స్ విడుదల తేదీలను తరచుగా వాయిదా వేస్తున్నారు.
- సినిమా విడుదల గురించి సమాచారం ఇవ్వకపోవడం ప్రేక్షకులను నిర్లక్ష్యం చేయడమే.
- గేమ్ ఛేంజర్, హరి హర వీరమల్లు సినిమాలు విడుదల తేదీల విషయంలో గందరగోళం సృష్టించాయి.
- విశ్వంభర, ప్యారడైజ్, పెద్ది, స్వయంభు సినిమాలు కూడా విడుదల తేదీలతో ఆడుకుంటున్నాయి.
టాలీవుడ్ మేకర్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లుగా ఉంది. సినిమా విడుదల తేదీలను ప్రకటనలు చేసిన తర్వాత కూడా వాయిదా వేస్తూ నిరాశ పరుస్తున్నారు. ఈ మధ్య విడుదల వాయిదా వేసిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిలీజ్ డేట్స్ తో టాలీవుడ్ దోబూచులాట
Release Postponements: ఎప్పుడు వదిలితేనేం ఆడియన్స్ చూడకపోతారా అన్నట్టుగా ఉంది మన మేకర్స్ వ్యవహారం. గతంలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారంటే ఏది ఏమైనా ఆ తేదీకి సినిమాని వదిలితీరాల్సిందే అన్నట్టుగా ఉండేది పరిస్థితి.కాని ఇప్పుడు చెప్పిన తేదీకి సినిమాని వదలడం అన్నది గగనం అయిపొయింది. ఏదైనా పెద్ద సినిమా చెప్పిన తేదీకి రిలీజ్ అయిందంటే అదో పెద్ద మిరాకిల్ .
ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటున్న మేకర్స్
అయితే ఆ వాయిదాల పాట అలా ఉంటె కనీసం చెప్పిన తేదీకి సినిమాని వదలట్లేదు అన్న సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేశాంగా ..అలవాటయిపోయి ఉంటుందనేమో కాబోలు.ఆ మధ్య డిజాస్టర్ అయిన గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలోజరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఇక హరి హర వీరమల్లు ఎన్ని సార్లు వాయిదాల పాట పాడిందో లెక్కే లేదు. ఇక దేవర,పుష్ప 2 సినిమాలు ఇలా అనౌన్స్ చేసి డేట్స్ మార్చుకున్నవే.
రిలీజ్ డేట్లతో దోబూచులాడుతున్న సినిమాలు
వాటి సంగతి అలా ఉంటె తాజాగా ప్యారడైజ్, విశ్వంభర, పెద్ది, ‘స్వయంభు’ సినిమాలు కూడా రిలీజ్ డేట్లతో దోబూచులాడుతున్నవే. నిఖిల్ ‘స్వయంభు’ విషయానికే వస్తే ఈ రోజే అంటే ఏప్రిల్ 10వ తేదీన వస్తామంటూ తెగ బిల్డప్ ఇచ్చింది మూవీ టీమ్. కానీ అసలు సౌండే లేదు.పోనీ కనీసం ఈ రోజు రావట్లేదు అన్న చిన్న ఇన్ఫర్మేషన్ పోస్ట్ కూడా మేకర్స్ వదల్లేదంటే ఆడియన్స్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. పోనీ ఇప్పుడు కాదు మరెప్పుడైనా వస్తాము అని చెప్పలేని పరిస్థితి. అయితే సినిమాకి OTT డీల్ అనుకున్నంతగా అవ్వలేదన్నది ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా ఆడియన్స్ కోసమైనా చిన్న పోస్టర్ వేస్తె బాగుండు అని మూవీ లవర్స్ నుండి వినిపిస్తున్న మాట.
వాయిదాల బాటలో సినిమాలు
పెద్ది జూన్ 25 న రిలీజ్ పక్కానా ?
నికిల్ స్వయంభూ సంగతి ఇలా ఉంటె చరణ్ పెద్ది పరిస్థితి మరీ కామెడీ అయిపొయింది.మొదలెట్టినప్పుడు మార్చి 27 అన్నారు. ఆతర్వాత అబ్బే అప్పుడు కాదు ఏప్రిల్ 30 పక్కా అని ఊదరగొట్టారు. కాని చెప్పిన రిలీజ్ డేట్ ఇంకో 20 రోజులు ఉన్నప్పటికీ మేకర్స్ నుండి ఏ సౌండ్ వినపడకపోవడం చూస్తుంటే ఇది కూడా హ్యాండ్ ఇచ్చేసినట్టే అని డీలా పడిపోతున్నారు మెగా ఫ్యాన్స్.మరో వైపు మే1 కి చాలా సినిమాలు ఖర్చీప్ లు వేసుకుంటున్నాయ్ కూడా. సో ఫిలిం సర్కిల్స్ లో ఆల్రెడీ సినిమా పోస్ట్ పోన్ అన్న టాక్ వచ్చేసినట్టుంది.కానీ మా సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అని ఇప్పటికీ మేకర్స్ నోరు విప్పకపోవడమె ఆశ్చర్యం.అయితే జూన్ 25 న రిలీజ్ పక్కా అన్న టాక్ వినిపిస్తుంది కాని మేకర్స్ డేర్ చేసి ఎందుకు చెప్పట్లేదో.
పొంగల్ బరిలో దిగుతుందని ఊదరగొట్టిన విశ్వంభర
నిర్లక్ష్యంగా మేకర్స్
ఇక అప్పుడెప్పుడో గత పొంగల్ బరిలో దిగుతుందని ఊదరగొట్టిన విశ్వంభర మరో పొంగల్ దాటేసినా కూడా ఇంకా రిలీజ్ డేట్ ఎప్పుడో కన్ఫాం చేయకపోవడంతో అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేక అటకెక్కుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. స్వయంగా చిరునే జూన్ లేదా జులైలో రావొచ్చు అని చెప్పినప్పటికీ మేకర్స్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయని పరిస్థితి.మరికొద్ది రోజులైతే ఇదొక సినిమా ఉందన్న సంగతి ఆడియన్స్ మర్చిపోయినా ఆశ్చర్యం లేదు.
ప్యారడైజ్ డిసెంబర్ కి వెళ్ళే ఛాన్స్
ఇక ఆగస్టు 21న ప్యారడైజ్ పక్కా అన్నారు కాని వాలకం చూస్తుంటే క్వాలిటీ పేరు మీద ఈ సినిమా కూడా డిసెంబర్ కి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కాని టీమ్ నుండి మాత్రం నో రెస్పాన్స్. ఇలా సినిమాలు పోస్ట్ పోన్ కావడం ఇపుడు చాలా కామన్ కావొచ్చు.కాని అనౌన్స్ చేసిన డేట్స్ కి రావట్లేదు అన్న విషయాన్ని అభిమానులకు ముందే చెప్పి క్లారిటీ ఇవ్వాల్సిన కనీస ధర్మం మేకర్స్ పాటించకపోవడమే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతుంది.చూస్తుంటే ఆడియన్స్ ని డబ్బులు ఇచ్చే ATM మిషిన్ల భావించి,వాళ్ళ ఎమోషన్స్ తో మేకర్స్ ఫుట్‌బాల్ ఆడుకుంటున్నట్టె కనిపిస్తుంది.ఏది ఏమైనా ఆడియన్స్ ని ఇలా చిన్న చూపు చూస్తె మాత్రం ముందు ముందు సినిమాల మీద ఉన్న క్రేజ్ తగ్గిపోవడం ఖాయం.
మొత్తానికి టాలీవుడ్ మేకర్స్ మాత్రం విడుదల తేదీల విషయంలో ప్రేక్షకులను చాలా ఇబ్బంది పెడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై సినీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

