
📌 Key Points
- రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడే అవకాశం.
- తెలంగాణలో టికెట్ ధరల నిబంధనల వల్ల మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా.
- సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉండటంతో ఏప్రిల్ 30న విడుదల కష్టమేనంటున్న విశ్లేషకులు.
- ఒకవేళ వాయిదా పడితే మే 29 లేదా జూన్ 5న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్.
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
ఏప్రిల్ 30న పెద్ది విడుదల సాధ్యమేనా?
Peddi Movie:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా గేమ్ ఛేంజర్.ఈ చిత్రం పెద్దగా విజయాన్ని అందుకోలేదు. దీంతో ఎలాగైనా సరే మళ్లీ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రామ్ చరణ్.. అందులో భాగంగానే ‘ఉప్పెన’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిని తన వైపుకి లాగేసుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. తెలంగాణాలో టికెట్ ధరల పెంపుకు 90 రోజుల నిబంధన వెలుగులోకి రావడంతో సినిమాను వాయిదా వేశారు. అలా మార్చి 27న రావాల్సిన సినిమా కాస్త ఏప్రిల్ 30కి వాయిదా పడింది.
ఇకపోతే మేకర్స్ కూడా ఈ రిలీజ్ డేట్ ని వదులుకోకూడదని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ మరొకవైపు ఈ సినిమా వాయిదా పడబోతోంది అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ తో పాటు ఇంకా కొన్ని పాటల షూట్ మిగిలి ఉన్న నేపథ్యంలోనే ఏప్రిల్ 30న ఈ సినిమా రావడం కష్టమని అటు విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారు. ఇకపోతే పెద్ది సినిమా మిగిలిన షూటింగ్ పార్ట్ ను వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను తీసుకురావాలని చూస్తున్నప్పటికీ ఇలాంటి ఇతర కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతోందనే కామెంట్లు గట్టిగా వినిపిస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా ఒకవేళ పెద్ది మళ్ళీ వాయిదా పడితే మాత్రం అభిమానులకు తీరని నిరాశ ఎదురైనట్లే అని చెప్పాలి.
వాయిదాకు కారణాలు ఏమిటి?
మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకవేల పెద్ది సినిమా గనుక వాయిదా పడితే.. ఈ చిత్రాన్ని మే 29 లేదా జూన్ 5వ తేదీన రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా మరొకవైపు మీడియం రేంజ్ సినిమాలు పెద్ది రిలీజ్ డేట్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఒకవేళ పెద్ది అనుకున్న సమయానికి రాకపోతే తమ సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించే సినిమా బృందాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ సినిమా గాయపడ్డ సింహం మే 1న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. పైగా ఈ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు తమ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు అంటే పెద్ది రిలీజ్ డేట్ పై అనుమానాలు ఉన్నట్టే లెక్క .అందుకే పెద్ది రావట్లేదన్న స్పష్టమైన సమాచారం దిల్ రాజు దగ్గర ఉందని అందుకే తన గాయపడ్డ సింహం చిత్రాన్ని బరిలోకి దించుతున్నారని ఊహాగానాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి .ఏది ఏమైనా పెద్ది సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇలాంటి వార్తలు మింగుడు పడడం లేదు.
కొత్త విడుదల తేదీ ఎప్పుడు?
ఏది ఏమైనా ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడితే మాత్రం మెగా అభిమానులకు నిరాశ తప్పదు. మేకర్స్ మాత్రం సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.


