|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్: హైప్ ఎక్కువైతే అంతే సంగతులు! బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు!

Published: 19-02-2026, 2:35 AM
టాలీవుడ్: హైప్ ఎక్కువైతే అంతే సంగతులు! బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు!
  • రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ ‘గేమ్ చేంజర్’ అంచనాలను అందుకోలేకపోయింది.
  • కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ మొదటి పార్ట్ స్థాయిని అందుకోలేకపోయింది.
  • ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
  • రజనీకాంత్, నాగార్జునల ‘కూలీ’లో కథ లేకపోవడంతో నిరాశపరిచింది.

టాలీవుడ్‌లో విడుదలకి ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన కొన్ని సినిమాలు ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మేకర్స్ చేసిన హంగామాకి, సినిమాకి పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.

హైప్ క్రియేట్ చేసిన సినిమాలు

Tollywood Movies: ఇండ్రస్ట్రీ ఏదైనా సినిమా విడుదలకు ముందు ఇచ్చే హైప్ ఒక్కోసారి చిత్రానికే శాపంగా మారుతుంది. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకుడికి ఏమాత్రం తేడా కొట్టినా ఫలితం డిజాస్టర్‌గా మిగిలిపోతుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఓవర్ హైప్ వల్ల దెబ్బతిన్న భారీ చిత్రాలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మేకర్స్ చేసిన హంగామాకు, వెండితెరపై కనిపించిన మ్యాజిక్‌కు అస్సలు పొంతన లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరి అలాంటి సినిమాలు కొన్ని చూద్దాం..

రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ అనగానే ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ విడుదలయ్యాక ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. అటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ పరిస్థితి కూడా అంతే.. మొదటి పార్ట్ ఉన్న రేంజ్ చూసి సెకండ్ పార్ట్‌పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అంటూ వచ్చిన ‘వార్ 2’ పై దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ఇచ్చారు. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అటు రజనీకాంత్ – నాగార్జున వంటి దిగ్గజాలు కలిసి నటించిన ‘కూలీ’లో అనిరుధ్ మ్యూజిక్ తప్ప, కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు.

నిరాశపరిచిన సినిమాలు

సినిమా రిలీజ్ కాకముందే ఇది మైలురాయి అవుతుందని, ప్రపంచ స్థాయిలో ఉంటుందని చెప్పడం వల్ల ఆడియన్స్ మైండ్‌లో ఒక ఫిక్స్‌డ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. తీరా థియేటర్‌లో చూసినప్పుడు కథలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సినిమా నిలబడటం కష్టం. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ పాత మార్కు పడలేదని, వార్ 2 లో యాక్షన్ తప్ప ఎమోషన్ లేదని నెటిజన్లు పెదవి విరిచారు. రజనీ – నాగ్ కాంబోపై ఉన్న క్రేజ్‌ను దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయారనే కామెంట్స్ వినిపించాయి. ఈ చిత్రాలన్నీ వసూళ్ల పరంగా ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.

కథ లేకుంటే కష్టమే!

మొత్తానికి ఎన్ని హంగులు ఉన్నా, ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా.. చివరికి ప్రేక్షకుడు మెచ్చేది కథను మాత్రమేనని ఈ భారీ డిజాస్టర్లు మరోసారి నిరూపించాయి. హైప్ అనేది సినిమాను థియేటర్ వరకు తీసుకురాగలదు కానీ, సినిమాను గట్టెక్కించేది మాత్రం కంటెంట్ మాత్రమే అన్నది నిజం. ఇక భారీ అంచనాల మధ్య వచ్చే సినిమాల విషయంలో మేకర్స్ ఇకనైనా అతిగా ప్రచారం చేయకుండా, సినిమాలో మేటర్ ఉండేలా చూసుకోవడం మంచిది. లేదంటే ఎంతటి స్టార్లకైనా బాక్సాఫీస్ దగ్గర దెబ్బ తప్పదు అంటున్నారు విశ్లేషకులు.

ఏ సినిమాకైనా కథ అనేది చాలా ముఖ్యం. భారీ అంచనాలు ఉన్నప్పటికీ కథ లేకపోతే సినిమా నిలబడటం కష్టం. హైప్ సినిమాను థియేటర్ వరకు తీసుకురాగలదు కానీ, గట్టెక్కించేది మాత్రం కంటెంట్ మాత్రమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.