
వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో గత వారం ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితా ప్రకారం, హిట్ 3 సినిమా అత్యధిక వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
Key Points
నాని హిట్ 3 5.7 మిలియన్ వ్యూస్ తో టాప్ లో!
మలయాళం థ్రిల్లర్ తుడరుమ్ 5.6 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో!
రెట్రో, టూరిస్ట్ ఫ్యామిలీ, భూల్ చుక్ మాఫ్ కూడా టాప్ 5 లో!
ఓటీటీలో సినిమాలకు అద్భుతమైన ఆదరణ!
టాప్ 5 ఓటీటీ మూవీస్
వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి గతవారం ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 మూవీస్ జాబితా వచ్చేసింది. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన లిస్ట్ లో తెలుగు మూవీ హిట్ 3నే తొలి స్థానంలో ఉంది. మరి మిగిలిన ఆ నాలుగు సినిమాలు ఏవి? ఏ మూవీకి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి చూద్దాం.
ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈవారం కూడా ఆ లిస్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కేవలం ఇండియన్ ఆడియెన్స్, అది కూడా కనీసం 30 నిమిషాల పాటు చూసిన వ్యూస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది. అలా ఎక్కువ వ్యూస్ సాధించిన మూవీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.
1.హిట్ 3 – 5.7 మిలియన్ వ్యూస్
నాని నటించిన హిట్ 3 మూవీయే ఈవారం టాప్ లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 5.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేవలం జూన్ 2 నుంచి 8వ తేదీ మధ్య మాత్రమే నమోదైన వ్యూస్ ఇవి. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ హిట్ 3 దుమ్ము రేపుతోంది.
హిట్ 3 అద్భుత విజయం
2. తుడరుమ్ – 5.6 మిలియన్ వ్యూస్
మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ రెండో స్థానంలో ఉంది. ఆ సినిమాకు 5.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జియోహాట్‌స్టార్ లో మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.230 కోట్లకుపైగా వసూళ్లు రావడం విశేషం.
3. రెట్రో – 4.8 మిలియన్ వ్యూస్
సూర్య నటించిన రెట్రో మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు గతవారం 4.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది.
మిగిలిన టాప్ మూవీస్
4. టూరిస్ట్ ఫ్యామిలీ – 4.4 మిలియన్ వ్యూస్
తమిళ కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు కూడా ఊహించినట్లే ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 4.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
5. భూల్ చుక్ మాఫ్ – 4 మిలియన్ వ్యూస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన హిందీ మూవీ భూల్ చుక్ మాఫ్. థియేటర్లలో రిలీజైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ కామెడీ మూవీకి గత వారం 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
చివరగా, గత వారం ఓటీటీలో విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. హిట్ 3 సినిమా తన ప్రభావాన్ని చూపించింది.


