
📌 Key Points
- యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ టీజర్ విడుదల, ట్రోల్స్ ఎదుర్కొంటున్న హీరో.
- గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కమర్షియల్ చిత్రంగా ‘టాక్సిక్’.
- యశ్ సరసన కియారా అద్వానీ, సోదరి పాత్రలో నయనతార నటిస్తున్నారు.
- టీజర్ లోని బోల్డ్ సీన్స్ పై నెటిజన్ల విమర్శలు, మద్దతు.
కన్నడ హీరో యశ్ నటించిన ‘టాక్సిక్’ టీజర్ విడుదలైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ విడుదలైన వెంటనే యశ్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. దీనికి కారణం టీజర్ లోని కొన్ని సన్నివేశాలే అని తెలుస్తోంది.
విడుదలైన టాక్సిక్ టీజర్
Toxic Teaser:అంతర్జాతీయంగా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) తొలిసారి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్ (Toxic). అటు కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో యశ్ (Yash) సరికొత్త లుక్ లో ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) యశ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది . సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇందులో హీరోకి సోదరి పాత్రలో నటిస్తుండడం గమనార్హం. వీరితో పాటు తారా సుతారియా, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ టీజర్ విడుదలైన సందర్భంగా హీరో యశ్ పై మరొకసారి ట్రోల్స్ వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం . ముఖ్యంగా గతంలో ఆయన పలు ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలను బయటకు తీస్తూ ట్రోల్స్ గుప్పించడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో హీరో పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ యశ్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఒక హాలీవుడ్ నటితో ఇంటిమేట్ సీన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఈ సినిమా కన్నడ సినిమానే అయినా అటు పాన్ ఇండియా స్టార్ గా రిలీజ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ హాలీవుడ్ ప్రేక్షకులకు కామన్ అయినా ఇండియన్ సినీ ఆడియన్స్ కి ఇది మింగుడు పడడం లేదు.
యశ్ పై ట్రోల్స్ వెనుక కారణాలు
నెటిజన్ల స్పందన
ఇకపోతే తాజాగా టాక్సిక్ నుంచి రిలీజ్ అయిన్ టీజర్ కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్ లో కూడా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న బోల్డ్ సీన్ చూపించడంతో నెటిజన్స్ మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో “తల్లిదండ్రులతో కలిసి చూడలేని సీన్లను చెయ్యను” అని యశ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే అలాంటి వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేస్తూ కొందరు విమర్శిస్తుంటే.. మరి కొంతమంది ఇది నటుడి పరిణా క్రమమని మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ వచ్చిన వీడియోలో ఉన్న అసభ్యకర దృశ్యాల పై కర్ణాటక మహిళా కమిషన్ కి ఫిర్యాదులు కూడా అందాయి. అప్పుడే గీతూ మోహన్ దాస్ కూడా స్పందించింది . ఇప్పుడు మళ్లీ ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో యశ్ స్పందిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఈ ఇంటిమేట్ సీన్లు ఇంకెంత చర్చకు దారితీస్తాయో చూడాలి.
మొత్తానికి ‘టాక్సిక్’ టీజర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు వివాదాలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


