
📌 Key Points
- హాలీవుడ్ నటి జెన్నీఫర్ హార్మన్ 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
- ‘వన్ లైఫ్ టు లివ్’ సీరియల్‌లో కేథీ పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
- 1978లో ఎమ్మీ నామినేషన్ అందుకున్న జెన్నీఫర్ బ్రాడ్‌వేలోనూ రాణించారు.
- ఆమె మృతికి వృద్ధాప్య కారణాలు అయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
హాలీవుడ్ నటి జెన్నీఫర్ హార్మన్ 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘వన్ లైఫ్ టు లివ్’ సీరియల్‌లో కేథీ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె మరణం సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఆమె మృతికి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, వృద్ధాప్య కారణాలు అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
జెన్నీఫర్ హార్మన్ మృతి: ఇండస్ట్రీలో విషాదం
Film industry: సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియా ద్వారా ఇట్టే వైరల్ అవుతుంది. ఇటు టాలీవుడ్ ను మొదలుకొని అటు హాలీవుడ్ వరకు సెలబ్రిటీల జీవితాలలో జరిగే ప్రతి విషయం కూడా సంచలనంగా మారుతోందనే చెప్పాలి. కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటే.. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది గృహప్రవేశం చేస్తుంటే.. మరి కొంత మంది కొత్త వారసులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు ..ఇంకొంతమంది విడాకులు తీసుకుంటుంటే మరికొంతమంది ఏకంగా స్వర్గస్తులవుతున్నారు ..ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో బోలెడు.. ఈ క్రమంలోనే ఇటీవల గత వారం రోజులుగా ఏకంగా కొంతమంది సెలబ్రిటీలు రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఇప్పుడు మరొక సెలబ్రిటీ మరణించి అభిమానులను సైతం కన్నీటి పర్యంతం చేస్తున్నారు.
ఆమె ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ హార్మన్. ప్రస్తుతం ఆమె వయసు 82 సంవత్సరాలు.. ఈమె మరణించినట్లు ఈమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఈమె మరణానికి గల కారణం ఏమిటి అనే విషయంపై స్పందించకపోయినా.. ఆమె వృద్ధాప్య కారణాలతోనే మరణించి ఉండవచ్చు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే జెన్నీఫర్ హార్మన్ మరణం ఇండస్ట్రీని కుదిపివేసింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని నేడు మన మధ్య లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈమె మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
‘వన్ లైఫ్ టు లివ్’ నటి ప్రస్థానం
అభిమానుల, సినీ ప్రముఖుల సంతాపం
వన్ లైఫ్ టు లివ్ సీరియల్ లో కేథీ పాత్రతో గుర్తింపు పొందిన ఈమె 1978లో ఎమ్మీ నామినేషన్స్ ని అందుకున్నారు. బ్రాడ్ వే నాటక రంగంలో దశాబ్దాల పాటు రాణించిన ఈమె సుమారుగా 30కి పైగా ప్రముఖ ప్రదర్శనలలో నటించారు. హౌ టు సర్వైవ్ ఏ మ్యారేజ్ తో కెరీయర్ ను ప్రారంభించి.. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ప్రస్తుతం ఈమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
జెన్నీఫర్ హార్మన్ మృతి సినీ లోకానికి తీరని లోటు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.


