|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ustaad Bhagat Singh: అబ్బాయ్ తప్పుకుంటే .. బాబాయ్ వస్తున్నాడా.. ఉస్తాద్ రిలీజ్ అప్పుడేనా?

Published: 07-12-2025, 4:08 AM
Ustaad Bhagat Singh: అబ్బాయ్ తప్పుకుంటే .. బాబాయ్ వస్తున్నాడా.. ఉస్తాద్ రిలీజ్ అప్పుడేనా?
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏప్రిల్ 2026 బదులు మార్చిలోనే విడుదల కానుందని వార్తలు.
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చి 27న వాయిదా పడుతుందని సమాచారం.
  • ‘పెద్ది’ వాయిదాతో పవన్ కళ్యాణ్ సినిమా అదే తేదీకి రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.
  • ఈ వార్తతో అబ్బాయ్ (రామ్ చరణ్) తప్పుకుంటే బాబాయ్ (పవన్ కళ్యాణ్) వస్తున్నాడంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీపై కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 2026లో రావాల్సిన ఈ సినిమా, రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడటంతో మార్చిలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్: రిలీజ్ డేట్ అప్డేట్

Ustaad Bhagat Singh: మరి కొద్ది రోజులలో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ఎంతోమంది స్టార్ హీరోలు కొత్త సంవత్సరాన్ని టార్గెట్ చేస్తూ తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోల సినిమాలన్ని విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక 2026లో పలువురు స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh)సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఇటీవల నిర్మాతలు వెల్లడించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మరొక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ లో కాకుండా మార్చి నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. నిజానికి మార్చి నెలలో నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 26న విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు కానీ ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని తద్వారా రామ్ చరణ్ పెద్ది (Peddi) సినిమాకు లైన్ క్లియర్ అవుతుందని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి..

రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా.. పవన్ కళ్యాణ్ రాక?

తాజా సమాచారం ప్రకారం మార్చి 27 2026న విడుదల కాబోతున్న రామ్ చరణ్(Ramcharan) పెద్ది సినిమా కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వినపడుతున్నాయి.. ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజులలో పూర్తికానుంది అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సినిమా ప్రమోషన్ల కోసం కాస్త సమయాన్ని తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా మార్చి నెలలో విడుదల కాలేదనే విషయం తెలియడంతో అదే తేదీకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని విడుదల చేయాలనే మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

గబ్బర్ సింగ్ హిట్ రిపీట్ అయ్యేనా…

మార్చి 2026: అబ్బాయ్ తప్పుకుంటే బాబాయ్ వస్తాడా?

ఇలా మార్చ్ 27వ తేదీ విడుదల కావాల్సిన అబ్బాయి పెద్ది సినిమా తప్పుకుంటే కచ్చితంగా అదే తేదీకి బాబాయ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా రాబోతున్నారన్న విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే త్వరలోనే ఈ సినిమాల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఉస్తాద్ సినిమాతో మరోసారి గబ్బర్ సింగ్ సక్సెస్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 2026లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ హిట్ రిపీట్ అవుతుందని ఆశిస్తూ, త్వరలోనే మొదటి సింగిల్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.