
📌 Key Points
- రాజస్థాన్ రాయల్స్ చేతిలో RCB ఓటమి
- వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ – 28 బంతుల్లో 78 పరుగులు
- రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది
- జురెల్, జడేజా రాణించడంతో రాజస్థాన్ విజయం
ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు.
వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్
IPL సీజన్లో RCB తొలి ఓటమిని చవి చూసింది. శుక్రవారం గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచులో రాజస్థాన్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201/8 పరుగులు చేసింది. పటిదార్(63), విరాట్ కోహ్లీ(32), వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22) పరుగులు చేశారు. అయితే అనంతరం 202 పరుగుల టార్గెట్ తో బ్యాటింగుకు దిగిన రాజస్థాన్.. ఓపెనర్ సూర్యవంశీ వైభవ్ ధాటికి RCB బౌలర్లు బెంబేలెత్తారు. వరుస ఫోర్లు, సిక్సర్లు బాదుతూ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. 28 బాల్స్ లో 78 పరుగులు చేసి ఔటయ్యాడు. జురెల్(81*), జడేజా(24*) కూడా అదరగొట్టారు. దీంతో నిర్ణీత 202 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ చేధించింది. పవర్ ప్లే లో ఓపెనర్లు వైభవ్, జురెల్ భాగస్వామ్యమే RR విజయాన్ని ముందుగానే నిర్ణయించింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్, హేజెల్‌వుడ్ రెండేసి వికెట్లు తీశారు.
రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్
ఆర్సీబీ బౌలర్ల నిరాశజనక ప్రదర్శన
రాజస్థాన్ రాయల్స్ తన బ్యాటింగ్ పవర్ తో ఆర్సీబీని చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని మార్చింది. రాబోయే మ్యాచులలో ఆర్సీబీ పుంజుకుంటుందో లేదో చూడాలి.


