|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Varanasi Movie: వారణాసిలో ఆ సీన్ మైండ్ బ్లోయింగ్.. వేరే లెవెల్ అంతే: అనిల్ రావిపూడి

Published: 08-12-2025, 1:08 AM
Varanasi Movie: వారణాసిలో ఆ సీన్ మైండ్ బ్లోయింగ్.. వేరే లెవెల్ అంతే: అనిల్ రావిపూడి
  • రాజమౌళి-మహేష్ బాబుల ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • వారణాసిలో ఒక సీన్ కోసం కోట్లాది రూపాయలతో భారీ సెట్ వేశారు.
  • ఆ సెట్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అనిల్ రావిపూడి ప్రశంసించారు.
  • అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవి సినిమా ‘శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి-మహేష్ బాబుల ‘వారణాసి’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం వారణాసిలో వేసిన భారీ సెట్, అక్కడ చిత్రీకరించిన మైండ్ బ్లోయింగ్ సన్నివేశాల గురించి ప్రస్తావించి, సినిమాపై అంచనాలను పెంచారు.

రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై అంచనాలు

Varanasi Movie: టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాలలో వారణాసి (Varanasi)సినిమా ఒకటి. దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి (Rajamouli)సినిమా అంటేనే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) మొదటిసారి సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఒక గ్లింపు వీడియో కూడా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది.

తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు అదేవిధంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా కోసం వారణాసిలో వేసిన ఒక సెట్ చూసి తాను ఆశ్చర్యపోయానని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక్కడ తెరకెక్కించే సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని కచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అనిల్ రావిపూడి సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు.

వారణాసిలోని అద్భుతమైన సెట్ విశేషాలు

ఇక ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ సెట్ వేసినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి అయతే ఇక్కడ షూట్ చేసిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుతం చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాలో చిరంజీవి ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతుందని సమాచారం.

ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని జనవరి 12 2026న విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అదేవిధంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అనిల్ రావిపూడి ప్రస్తుత ప్రాజెక్ట్‌లు

మొత్తంగా, అనిల్ రావిపూడి వ్యాఖ్యలు ‘వారణాసి’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సినిమా విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు, ముఖ్యంగా వారణాసిలో రూపొందించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.