
యాంకర్ విష్ణుప్రియ తన తల్లి మరణం, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ఆసుపత్రి బిల్లులు లక్షల్లో కావడంతో వేణుస్వామి సాయం కోరానని, డిప్రెషన్‌కు గురైన విషయాన్ని వెల్లడించారు.
Key Points
యాంకర్ విష్ణుప్రియ తల్లి 42 ఏళ్లకే అనారోగ్య సమస్యలతో మరణించారు.
తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు లక్షల్లో బిల్లులు కావడంతో విష్ణుప్రియ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.
డబ్బుల కోసం వేణుస్వామికి ఫోన్ చేయగానే ఆయన వెంటనే సాయం చేశారని విష్ణుప్రియ తెలిపారు.
ఆసుపత్రి బిల్లుల కోసమే తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశానని విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు.
తల్లి అనారోగ్యం, మరణం – విష్ణుప్రియ ఆవేదన
Venu Swamy : యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీగానే ఉంది. రెండేళ్ల క్రితం తన తల్లి మరణించినట్టు అధికారికంగానే తెలిపింది. చిన్న వయసులోనే హెల్త్ సమస్యలతో విష్ణుప్రియ తల్లి మరణించింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లి హెల్త్ గురించి, అప్పుడు తాను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పింది విష్ణుప్రియ.(Venu Swamy)
లక్షల్లో ఆసుపత్రి బిల్లులు: వేణుస్వామి సాయం
విష్ణుప్రియ మాట్లాడుతూ.. మా అమ్మ 42 ఏళ్లకే చనిపోయింది. డబ్బులు లేక ఒకానొక సమయంలో మందులు వేసుకోలేదు. మా అమ్మకు డయాబెటిస్ ఉంది. మందులు వేసుకోకపోవడంతో రియాక్షన్ వచ్చింది. మెడికల్ చెకప్ చేయించేది కాదు. హార్ట్ స్ట్రోక్ వచ్చేంతవరకు హాస్పిటల్ కి వెళ్ళలేదు మా అమ్మ. నేను చెకప్ చేయిద్దాం తీసుకెళ్తా అని అడిగినా వద్దు అనేది. స్ట్రోక్ వచ్చాక హాస్పిటల్ లో జాయిన్ చేస్తే మూడు రోజుల్లో చనిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. కానీ దేవుడి దయ వల్ల ఒక సంవత్సరం బతికింది.
అమ్మ హాస్పిటల్ లో ఉన్నప్పుడు బిల్లు లక్షల్లో అయింది. నేను అప్పటిదాకా ఎవర్ని డబ్బులు అడగలేదు. కానీ డబ్బులు అడగాల్సిన పరిస్థితి. నా జీవితంలో వరస్ట్ ఫేజ్ అది. వేణుస్వామి గురించి అందరూ ఏదో ఏదో చెప్తారు. అవన్నీ వాళ్ళ ఇష్టం. కానీ ఆయన నాకు ఎప్పట్నుంచో తెలుసు. మా అమ్మ హాస్పిటల్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం నేను వేణుస్వామి గారికి ఫోన్ చేసి అడగ్గానే డబ్బులు పంపించారు. ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఆయన హెల్ప్ చేస్తారు. మా అమ్మ చనిపోయాక డిప్రెషన్ కి వెళ్ళా. నన్ను ఎందుకు ఉంచావు, మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళావు అని దేవుడి దగ్గర ఏడ్చేదాన్ని. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది కూడా అమ్మ హాస్పిటల్ బిల్స్ కట్టడం కోసమే అంటూ ఎమోషనల్ అయింది.
డిప్రెషన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్
తల్లిని కోల్పోయిన బాధతో పాటు ఆర్థిక కష్టాలను కూడా విష్ణుప్రియ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె నిజాయితీతో కూడిన భావోద్వేగ ప్రకటన అనేక మందిని కదిలించింది. వేణుస్వామి సాయం, ఆమె పడిన తపన అభినందనీయం.


