
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు అధికారిక ప్రకటన!
- కాబోయే కోడలికి విజయ్ తల్లిదండ్రుల కండిషన్: మా అబ్బాయిని ప్రేమగా చూసుకుంటే చాలు!
- రష్మికను హీల్ చేసిన విజయ్.. అతడే నాకు ముఖ్యమని తెలిపిన రష్మిక మందన్న.
- విరోష్ పేరుతో పెళ్లికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన జంట.. అభిమానుల ఆనందం.
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విజయ్, రష్మిక పెళ్లి ఎక్కడో తెలుసా?
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ, వీరికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక, విజయ్ పెళ్లి ఈ గురువారమే అంటే ఫిబ్రవరి 26న జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీళ్ల లవ్ స్టోరీ జర్నీ, విజయ్ పేరెంట్స్ తమ కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి.. తమ డ్రీమ్ కోడలు ఎలా ఉండాలో చెబుతూ మాట్లాడిన ఒక పాత వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.
కోడలికి విజయ్ తల్లిదండ్రుల కండిషన్ ఏంటంటే..
“మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. ఆమె అతన్ని బేషరతుగా ప్రేమించాలి అంతే. అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, ఆమె అతన్ని బాగా అర్థం చేసుకోవాలి” అని మాధవి చెప్పుకొచ్చారు.
కోడలికి విజయ్ పేరెంట్స్ పెట్టిన కండీషన్ ఇదే!
అదే సమయంలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా తన భార్య అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. “తనకు నచ్చిన అమ్మాయినే అతను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, అంచనాలు లేవు. అలాగే నాకు కులం, మతం గురించి కూడా ఎలాంటి పట్టింపులు లేవు. అతను ఒక భారతీయురాలిని, ముఖ్యంగా ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
లవ్ మ్యారేజే చేసుకుంటానన్న విజయ్
రష్మిక కూడా తన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్స్ సమయంలో పరోక్షంగా విజయ్ గురించి మాట్లాడుతూ.. “అదృష్టవశాత్తూ తనకు ఏమాత్రం సంబంధం లేని ఒక బాధ నుంచి నన్ను నయం చేసిన పార్టనర్ నాకు దొరికాడు. నా వరకు భూమాలా అతడు నన్ను హీల్ చేశాడు. ఈ సినిమా నాకెంత ముఖ్యమో, అతడు కూడా అంతే.. ఆ క్రెడిట్ అంతా అతడికే ఇవ్వాలి. కృతజ్ఞతలు చెప్పాలి” అని ఎమోషనల్ అయింది.
విరోష్ వెడ్డింగ్: అసలు స్టోరీ ఏంటంటే?
పెళ్లిని కన్ఫమ్ చేసిన విరోష్
“మేము మా కోసం ఎలాంటి ప్లాన్స్ చేసుకోకముందే, ఏదీ ఎంచుకోకముందే.. మీరు ఉన్నారు. ఎంతో ప్రేమతో మీరే మాకు ఒక పేరు పెట్టారు. మమ్మల్ని “విరోష్” (VIROSH) అని పిలిచారు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా, మా కలయికకు మీ గౌరవార్థం ఆ పేరే పెడుతున్నాము. మా పెళ్ళికి “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అని పేరు పెట్టాలనుకుంటున్నాము. మమ్మల్ని ఇంతలా ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో ఒక భాగమే. బిగ్గెస్ట్ హగ్స్ అండ్ ఫుల్ లవ్!” అని అన్నారు.
ఇక సోమవారం (ఫిబ్రవరి 23) విజయ్, రష్మిక తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. మంగళవారం నుంచి వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


