|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జననాయగన్’ లీక్ కేసు: ముగ్గురు నిందితులు అరెస్ట్! అసలు కుట్ర వెనుక ఎవరు?

Published: 16-04-2026, 11:35 PM
విజయ్ 'జననాయగన్' లీక్ కేసు: ముగ్గురు నిందితులు అరెస్ట్! అసలు కుట్ర వెనుక ఎవరు?
  • ‘జననాయగన్’ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్.
  • కోయంబత్తూరుకు చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్ కూడా అరెస్ట్.
  • లీక్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు.
  • ఇప్పటికే 300 పైరసీ లింకులను తొలగించిన పోలీసులు.

దళపతి విజయ్ సినిమా ‘జననాయగన్’ లీక్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. లీక్ వెనుక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

‘జననాయగన్’ లీక్ మిస్టరీ వీడింది

Jananayagan Piracy: గత కొన్ని రోజులుగా ‘జననాయగన్’ సినిమా పైరసీ చుట్టూ పెను దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లీక్ కేసుకు సంబంధించి రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం జరిపిన దర్యాప్తులో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. ఏప్రిల్ 11న కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) కంప్లైంట్‌తో మొదలైన ఈ దర్యాప్తు, కేవలం కొద్ది రోజుల్లోనే ప్రధాన నిందితులను కటకటాల వెనక్కి నెట్టింది.

కోయంబత్తూరుకు చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్

ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ లీక్ వెనుక ఉన్న నిందితుడు కేవలం డేటాను దొంగిలించడమే కాకుండా, దానికి ‘edit_red14012026’ అనే వాటర్‌మార్క్‌తో కూడిన ఎడిట్ రిఫరెన్స్‌ను జోడించి ఆన్‌లైన్‌లో వదిలినట్లు గుర్తించారు. ఈ కేసులో మరో షాకింగ్ ఎలిమెంట్ ఏమిటంటే, ఒక కోయంబత్తూరుకు చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్ కూడా ఈ లీక్డ్ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రసారం చేస్తూ పోలీసులకు చిక్కాడు.

లీక్ వెనుక కుట్ర కోణం

సినిమా క్రేజ్‌ను తగ్గించడానికి కావాలనే

ప్రధాన నిందితుడు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ కావడంతో, అతను స్టూడియోలోని సెక్యూరిటీ లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుని దాదాపు 5 నిమిషాల నిడివి గల కీలకమైన టైటిల్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సీన్ మరియు క్లైమాక్స్ భాగాలను తొలగించి క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేశాడు. అక్కడి నుండి ఈ లింకులను డ్రైవ్ ఫోల్డర్ల ద్వారా షేర్ చేయడంతో పైరసీ విపరీతంగా పెరిగిపోయింది.

దీనిపై స్పందించిన పోలీసులు ఇప్పటికే 300కు పైగా పైరసీ లింకులను ఇంటర్నెట్ నుండి తొలగించారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ మరియు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.రాజకీయంగా కూడా ఈ లీక్ తమిళనాట చిచ్చు రేపుతోంది. విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ నాయకులు ఈ లీక్ వెనుక అధికార పార్టీ డీఎంకే తో పాటు బీజేపీ కూడా ఉందని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. విజయ్ రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి, సినిమా క్రేజ్‌ను తగ్గించడానికి కావాలనే ఈ కుట్ర పన్నారని వారు వాదిస్తున్నారు.

రాజకీయ దుమారం రేపుతున్న లీక్

పైరసీని తీవ్రంగా ఖండించిన టాప్ హీరోలు

అయితే, సెన్సార్ బోర్డ్ (CBFC) మాత్రం ఈ లీక్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, చిరంజీవి వంటి టాప్ హీరోలు ఈ పైరసీని తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.అలా ఎడిటింగ్ రూమ్ నుండి మొదలైన ఈ పైరసీ చివరికి పొలిటికల్ వార్ కి దారి తీసింది. చూడాలి మరి ఈ లీకేజ్ ఎన్నికల్లో విజయ్ కి డ్యామేజ్ చేస్తుందో లేక మైలేజ్ పెంచుతుందో.

‘జననాయగన్’ లీక్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ లీక్ వెనుక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.