
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్.
- పబ్లిక్ ఈవెంట్‌లో విజయ్ మీసాలు తిప్పిన రష్మిక, కర్చీఫ్‌తో చెమట తుడిచి ఆకట్టుకుంది.
- పెళ్లి తర్వాత మొదటిసారిగా స్కాలర్‌షిప్ పంపిణీలో పాల్గొన్న స్టార్ కపుల్.
- 151 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన విజయ్-రష్మిక దంపతులు.
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక క్యూట్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెళ్లి తర్వాత మొదటిసారి ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఈ స్టార్ కపుల్, చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
రష్మిక మీసం తిప్పిన క్షణం: వైరల్ అయిన క్యూట్ వీడియో!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే ఈ జంట, పెద్దలను ఒప్పించి మరీ, గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి జరగగానే హనీమూన్ ఎంజాయ్ చేసిన ఈ జంట.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేసింది. అయితే లేటెస్ట్ గా స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమంలో మెరిసారు విజయ్, రష్మిక. ఈ సందర్భంగా విజయ్ మీసాలు రష్మిక తిప్పగా, ఆ క్యూట్ వీడియో వైరల్ గా మారింది.
స్టేజ్ పైన ఉన్న విజయ్ కి చెమట వచ్చిన నేపథ్యంలో కర్చీఫ్ తో తుడిచిన రష్మిక… అనంతరం తన భర్త మీసాన్ని తిప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వేదిక పైన ఇలా చేస్తే కచ్చితంగా వీళ్లకు దిష్టి తగులుతుందని కొందరు అంటుంటే… భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కాగా అచ్చంపేట నియోజకవర్గంలో స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 47 ప్రభుత్వ పాఠశాలలలో 9, 10 తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన 151 మంది విద్యార్థులకు రష్మిక-విజయ్ దంపతులు నగదు బహుమతి అందించారు.
స్కాలర్‌షిప్ పంపిణీలో విజయ్-రష్మిక దంపతుల సందడి!
నెటిజన్ల రియాక్షన్: ప్రేమ జంటపై రకరకాల కామెంట్లు!
విజయ్-రష్మికల ఈ క్యూట్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారి ప్రేమకు ఇది నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.


