|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ టెన్షన్.. త్రిష తిరుమల యాత్ర: తమిళనాడు ఫలితాల వేళ సినీ ప్రపంచంలో కలకలం!

Published: 04-05-2026, 1:45 AM
విజయ్ టెన్షన్.. త్రిష తిరుమల యాత్ర: తమిళనాడు ఫలితాల వేళ సినీ ప్రపంచంలో కలకలం!
  • త్రిష 44వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
  • తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ టెన్షన్ లో ఉన్నాడు.
  • త్రిష-విజయ్ మధ్య సంబంధంపై గత కొన్ని నెలలుగా వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
  • తిరుమలలో అభిమాని వ్యాఖ్యలకు త్రిష నవ్వుతూ స్పందించింది.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష తన 44వ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఒకవైపు తమిళనాడు ఎన్నికల ఫలితాల టెన్షన్ లో విజయ్ ఉండగా, త్రిష తిరుమల పర్యటన, ఆమెపై వస్తున్న వదంతులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

త్రిష పుట్టినరోజు, తిరుమల పర్యటన

Trisha Krishnan:కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న త్రిష దక్షిణాది భాషలలో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ తరగని అందంతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇకపోతే ఈరోజు ఈమె 44వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజనులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఈమె పుట్టిన రోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి దర్శనం కోసం వెళ్ళింది. ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు సినీనటి కారణంగా తాను తన భర్తకు విడాకులు ఇస్తున్నాను అని సంగీత కూడా కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ నడుస్తున్న వేళ మరొకవైపు తమిళనాడులో టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు విజయ్. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ టెన్షన్ లో ఉండగా.. మరోవైపు ఈరోజు ఆమె పుట్టిన రోజు.. పైగా తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకోవడానికి ఆమె తిరుమలకు వెళ్ళింది. ఇవన్నీ కాదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ కూడా సంచలనానికి దారితీసింది. నిన్న రాత్రి కారులో తిరుపతికి వెళుతున్న వీడియోని షేర్ చేసింది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో త్రిష తిరుపతి పర్యటన అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దర్శనం చేసుకున్న తర్వాత ఉదయాన్నే తిరుపతి ఎళుమలైయన్ ఆలయంలో సుప్రభాత సేవకు హాజరైంది.

దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో నడుస్తుండగా ఒక అభిమాని మేడం ఈరోజు ఫలితం మన వైపే ఉంది అంటూ కామెంట్ చేయగా ..త్రిష నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయింది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఇకపోతే ఇది చూసిన నెటిజన్స్ అటు బర్తడే ఇటు విజయ్ ఎన్నికల ఫలితాలు అన్నీ శుభంగా జరగాలి అని తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది త్రిష అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ ఎన్నికల ఫలితాలు, టెన్షన్

ఇక త్రిష విషయానికి వస్తే ..2002లో వచ్చిన మౌనం పేసియతే చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత తమిళ్ , తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన వర్షం సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న ఈమె తన అద్భుతమైన నటనతో తమిళనాడు రాష్ట్ర అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పొన్నియన్ సెల్వన్, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, విదాముయార్చి వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న ఈమె.. ప్రస్తుతం చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. అలాగే కరుప్పు సినిమాలో కూడా నటిస్తోంది. ఇక మే 14 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రిష-విజయ్ వదంతులు, అభిమానుల స్పందన

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి త్రిష pic.twitter.com/LCLxAOEpq2

— ChotaNews App (@ChotaNewsApp) May 4, 2026

త్రిష పుట్టినరోజు, విజయ్ ఎన్నికల ఫలితాలు, వారిద్దరిపై వదంతులు.. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుమల పర్యటనతో త్రిష ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.