|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ సినిమాను వద్దన్న యంగ్ హీరో! ఫ్యాన్స్ షాక్!! ఇంతకీ కారణం ఏంటో?

Published: 15-04-2026, 10:35 AM
ప్రభాస్ సినిమాను వద్దన్న యంగ్ హీరో! ఫ్యాన్స్ షాక్!! ఇంతకీ కారణం ఏంటో?
  • యంగ్ హీరో తిరువీర్‌కు ప్రభాస్ ఫౌజీ సినిమాలో అవకాశం వచ్చింది.
  • విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో మురుగన్ పాత్రకు కూడా తిరువీర్‌ను సంప్రదించారు.
  • డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఫౌజీ సినిమాను తిరువీర్ రిజెక్ట్ చేశారు.
  • ఇతర సినిమాల కోసం లుక్ మార్చాల్సి రావడంతో కొన్ని అవకాశాలు కోల్పోయానని తిరువీర్ తెలిపారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, యంగ్ హీరో తిరువీర్ మాత్రం ఫౌజీ సినిమాలో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశారు. ఎందుకో తెలుసుకుందాం.

ప్రభాస్ సినిమాలో అవకాశం వదులుకున్న హీరో

Fauzi Film: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు . పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ సినిమాలో చిన్న చాన్స్ వచ్చిన ఏ ఒక్కరూ వదులుకోరు. ప్రభాస్ సినిమాలో ఒక చిన్న పాత్రలో అయినా కనిపించాలని కోరుకుంటారు. అలాంటిది ప్రభాస్ సినిమాలో చేసే అవకాశం వస్తే సింపుల్గా ఒక హీరో రిజెక్ట్ చేశారనే విషయం తెలిసి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ప్రభాస్ సినిమా ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే..

ప్రస్తుతం విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి వారిలో యంగ్ హీరో తిరువీర్ (Thiruveer)ఒకరు. త్వరలోనే ఈయన పాపం ప్రతాప్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన ప్రభాస్ ఫౌజీ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తనకు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అలాగే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో కూడా తనకు మురుగన్ పాత్రలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

తిరువీర్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే

ఇలా ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ తాను రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు. డేట్స్ అడ్జస్ట్ గాని నేపథ్యంలో ఈ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. తనకు హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయాలని ఆఫర్లు కూడా వస్తున్నాయని అయితే కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేయగా మరికొన్ని కథలు డేట్స్, లుక్ సమస్య కారణంగా వదులుకున్నానని తెలిపారు. విభిన్న సినిమాలలో నటిస్తే నెలకు ఒక లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. తద్వారా కొన్ని సినిమాలను తప్పక రిజెక్ట్ చేశానని తెలిపారు. నాకోసం స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ ఆపుకోలేరు. వాళ్ళకంటూ బడ్జెట్ టార్గెట్స్ అలాగే కొన్ని కండిషన్లు కూడా ఉంటాయని తెలిపారు.

ఎన్నో కండిషన్లు  ఉంటాయి..

డేట్స్ సమస్యే ప్రధాన కారణమా?

ఇలాంటి కండిషన్ల కారణంగా మనకోసం ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే తాను ఇలాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వచ్చిన వదులుకున్నానని ఈయన తెలియజేయడంతో తిరువీర్ అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం వదులుకోవడం అంటే సాహసమే అని చెప్పాలి. అయితే ఈయన రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు. తన వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే సినిమాలను రిజెక్ట్ చేశారని చెప్పడంతో ఈయన ఆలోచన తీరుపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.

ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడం అదృష్టమే. కానీ, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. తిరువీర్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.