|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆది సాయికుమార్ లవ్ స్టోరీ మళ్ళీ మొదలు! ‘సైరా బాను’ మూవీ ప్రారంభం!!

Published: 03-04-2026, 6:35 AM
ఆది సాయికుమార్ లవ్ స్టోరీ మళ్ళీ మొదలు! 'సైరా బాను' మూవీ ప్రారంభం!!
  • ఆది సాయికుమార్, బాంధవి శ్రీ జంటగా ‘సైరా బాను’ చిత్రం ప్రారంభం
  • ఫణి కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ప్రేమకథా చిత్రం
  • రాజేష్ దండ నిర్మాతగా, శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహిస్తున్నారు
  • పూజా కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు

ఆది సాయికుమార్ కొత్త సినిమా ‘సైరా బాను’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాంధవి శ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫణి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేమకథా చిత్రంగా ఉండనుంది.

ఘనంగా ‘సైరా బాను’ పూజా కార్యక్రమం

Aadi Sai Kumar: సీనియర్ నటుడు సాయికుమార్ వారసుడిగా ఆది సాయికుమార్(Aadi Sai Kumar) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటిస్తూ వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయికుమార్ ఇటీవల ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు చాలా రోజుల తర్వాత ఈయన శంభాల సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈయన తదుపరి వరుస సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆది సాయికుమార్ ఈగో రాజా అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఇటీవల ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు ఆది సాయికుమార్ ఇంకో కొత్త సినిమాకు కూడా కమిట్ అయ్యారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఫణి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్(Aadi Sai Kumar) జోడిగా బాంధవీ శ్రీ (bandhavi Sri)హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర దర్శకత్వం వహించగా రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ సినిమాకు ‘సైరా బాను'(Saira Banu) అనే టైటిల్ కూడా ప్రకటించారు. సినిమా టైటిల్ చూస్తుంటే ముస్లిం అమ్మాయితో హిందూ అబ్బాయి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు క్లాప్ కొట్టగా, రామ్ అబ్బరాజు, నటుడు సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట ఝాన్సీ నాని ఈ సినిమా స్క్రిప్ట్ అందజేశారు. ఇలా ఈ సినిమా ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది..

ప్రేమకథా చిత్రంగా ఆది సాయికుమార్ కొత్త సినిమా

A formal beginning… to a love story that breaks every boundary ❤️ #SairaBanu Pooja Ceremony commenced today✨

Camera switch on by @RamAbbaraju @saikumaractor garu Script handover by @konavenkat99 @JainsNani First shot direction @filmsyogi

Shoot… pic.twitter.com/Dd9puJhW9d

చిత్ర యూనిట్ వివరాలు, సినీ ప్రముఖుల హాజరు

— Hasya Movies (@HasyaMovies) April 3, 2026

ఆది సాయికుమార్ తిరిగి మళ్లీ ప్రేమ కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే ముస్లిం అమ్మాయి ప్రేమలో పడే హిందు అబ్బాయిగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా సైరా భాను టైటిల్ ప్రకటించడంతో ఎంతోమంది ఈ టైటిల్ పై స్పందిస్తూ అచ్చం బొంబాయి సినిమాని తలపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆ సినిమా కూడా ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడిన అబ్బాయి కథ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 30 సంవత్సరాలు తర్వాత మరోసారి ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నేడు ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి, ఆది సాయికుమార్ తిరిగి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సైరా బాను’ చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.