
📌 Key Points
- ‘శంబాల’ సక్సెస్‌తో మంచి ఊపుమీదున్న ఆది సాయికుమార్.
- వేదిక హీరోయిన్‌గా నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలకు సిద్ధం.
- హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘జంగిల్’ చిత్రం.
- త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘జంగిల్’ మూవీ.
ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన ‘జంగిల్’ అనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో వేదిక హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
‘శంబాల’ సక్సెస్‌తో ఊపుమీదున్న ఆది
Aadi Saikumar: హిట్ సినిమా పడక చాలా ఒత్తిడిలో ఉన్న ఆది సాయికుమార్ (Aadi Saikumar)కు ‘శంబాల’ (Shambhala) రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఆయన కొన్నాళ్ల పాటు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. కాకపోతే, ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగు ఆయన చాలా జాగ్రత్తగా వేయాలని, ఇటీవల ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఈవెంట్స్‌లో పెద్దలు ఆయనకు సూచించారు. ఆది సాయికుమార్ కూడా ఇకపై ఏ కథ పడితే ఆ కథ ఓకే చేయకుండా, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఆది సాయికుమార్ చేయబోయే తదుపరి చిత్రం కూడా ‘శంబాల’ తరహాలోనే మూడు అక్షరాలతోనే ఉండబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే..
వేదికతో కలిసి ‘జంగిల్’ మూవీలో ఆది సాయికుమార్
‘శంబాల’ సక్సెస్ తర్వాత మరోసారి కంటెంట్ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆది సాయికుమార్ సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక (Vedhika) హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ (Jungle). సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ తెలియజేశారు. ఫ్రైడే పిక్చర్స్ పతాకంపై రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్చ్ చేతిలోనే ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ‘శంబాల’ కంటే ముందే రావాల్సింది. అప్పట్లో వచ్చిన టీజర్ కూడా చాలా మంచి స్పందనను రాబట్టుకుంది.
త్వరలో విడుదల కానున్న హారర్ థ్రిల్లర్ ‘జంగిల్’
‘శంబాల’ సక్సెస్‌తో ఈ సినిమా నిర్మాతలకు ఫుల్ కాన్ఫిడెంట్ రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ఈ అప్డేట్‌తో తెలిపారు. ఈ మూవీలో కూడా ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సీట్లలో నుంచి కదలకుండా చేస్తుందని నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. త్వరలో ట్రైలర్‌తో పాటు మరిన్ని అప్డేట్స్‌ను ఇస్తామని ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.
ఆది సాయికుమార్ ‘శంబాల’ వంటి సక్సెస్ తర్వాత ‘జంగిల్’తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.


