
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్.
- అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
- కొత్తగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ సినిమా అంచనాలను రెట్టింపు చేసింది.
- ఈ సినిమా సనాతన ధర్మం గురించి సందేశం ఇస్తుందని భావిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ టీజర్ సినిమా హైప్ ని మరింత పెంచింది.
బోయపాటి-బాలయ్య కాంబో ప్రత్యేకత
Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ. సింహ సినిమాతో మొదలైన వీళ్ళ ప్రస్థానం ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఉన్నాయి. అసలు బాలకృష్ణ ఏమి చేస్తే ప్రేక్షకులకి నచ్చుతుందో అని పూర్తి అవగాహన ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా సీన్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు బోయపాటి.
అయితే వీరిద్దరూ కలిసి అఖండ 2 సినిమా చేసిన సంగతి తెలిసిందే ఈపాటికి థియేటర్స్ లో విడుదలై సంచలనం సృష్టించవలసిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిపోయింది. దానికి కొన్ని ఆర్థిక లావాదేవీలు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు నిన్నటితో డిసెంబర్ 12న వస్తుంది అని క్లారిటీ ఇచ్చేసారు. రేపు సాయంత్రం నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. ఈ తరుణంలో మరో రిలీజ్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇప్పటికే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు ఎవర్రా విభూది కొండని ఆపేది? అలానే ఒక్క మనిషిని పట్టుకొని దిష్టి తీసి రివర్స్ ల నేలకేసి కొట్టినప్పుడు వచ్చే షాట్ నెక్స్ట్ లెవెల్. ఇది కదా బాలయ్య అభిమానులకు కావాల్సింది అనిపించేలా ఉంది రిలీజ్ టీజర్.
THE UNSTOPPABLE DIVINE ROAR 🔥🔥🔱 #Akhanda2 GRAND RELEASE TEASER out Now!
అఖండ 2 రిలీజ్ టీజర్ హైలైట్స్
Book your tickets now! 🎟️ https://t.co/8l5WolzzT6
In theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱 #Akhanda2Thaandavam ‘GOD OF MASSES’ #NandamuriBalakrishna … pic.twitter.com/dVDff9JDD9
— 14 Reels Plus (@14ReelsPlus) December 10, 2025
సినిమా విడుదల తేదీ, అంచనాలు
ఇకపోతే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అవుతుంది అని ఉద్దేశంతోనే చాలామంది ఎదురు చూస్తున్నారు మరోవైపు సినిమా తాండవం పక్కన పెడితే థియేటర్లో కూడా తాండవం మొదలుకానున్నట్లు అర్థమయిపోతుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, ఖచ్చితంగా ఒక మెసేజ్ డిజైన్ చేయబడి ఉంటుంది.
అయితే ఈ సినిమాలో ఎక్కువగా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. స్వతహాగా బాలకృష్ణ ఎంత భక్తితో ఉంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో కూడా పలు సందర్భాలలో ముహూర్తాలు పెట్టి అప్డేట్స్ ఇచ్చారు. ఈ టీజర్ కూడా 7 : 16 నిమిషాలకు అని చెప్పారు కానీ సరైన టైమ్ కి విడుదల చేయలేకపోయారు.
అఖండ 2 రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బాలకృష్ణ, బోయపాటిల విజయవంతమైన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.


