|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్షయ్ కుమార్ ఇంట గ్యాస్ కష్టాలు! యుద్ధం ఎఫెక్ట్.. కిలాడీ సైతం విలవిల!

Published: 18-03-2026, 4:05 AM
అక్షయ్ కుమార్ ఇంట గ్యాస్ కష్టాలు! యుద్ధం ఎఫెక్ట్.. కిలాడీ సైతం విలవిల!
  • యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది.
  • అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ముందు జాగ్రత్తగా రెండు ఇండక్షన్ స్టవ్‌లు ఆర్డర్ చేశారు.
  • భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం 60% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది.
  • అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ ఏప్రిల్ 10, 2026న విడుదల కానుంది.

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంటి వరకు చేరింది. గ్యాస్ కొరత కారణంగా ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఇండక్షన్ స్టవ్ లను ఆర్డర్ చేశారు. దేశంలో ఎల్పీజీ కొరత తీవ్రంగా ఉంది.

యుద్ధం ఎఫెక్ట్: గ్యాస్ కొరతతో సామాన్యులు విలవిల

Akshay kumar: యుద్ధం ఎక్కడో పశ్చిమాసియా (Middle East)లో జరుగుతుంటే.. దాని వేడి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల కిచెన్ వరకు చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ (LPG) సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా ముంబై వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆల్టర్నేట్ ఎంటని చూస్తున్నవాళ్ళే. ఇపుడు తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా చేరిపోయారు.

ట్వింకిల్ ఖన్నా ‘మాస్టర్ ప్లాన్’.. బ్యాకప్ రెడీ ముంబైలో మంగళవారం జరిగిన ‘ముంబై క్లీన్ లీగ్’ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్‌కు మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ముంబైలో నెలకొన్న గ్యాస్ కొరతపై మీ స్పందన ఏంటని అడగ్గా.. అక్షయ్ తనదైన శైలిలో స్పందించారు.’ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే గ్యాస్ సమస్య లేదు. కానీ మున్ముందు ఏమవుతుందోనని నా భార్య (ట్వింకిల్ ఖన్నా) మొన్ననే రెండు ఇండక్షన్ స్టవ్‌లు ఆర్డర్ చేసింది. అవి ఇంకా డెలివరీ అయ్యాయో లేదో నాకు తెలియదు కానీ.. ముందు జాగ్రత్తగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పుకొచ్చారు ఈ కిలాడీ.అంతేకాదు, ‘ఎందుకైనా మంచిది.. మీరు కూడా ఒక ఇండక్షన్ స్టవ్ కొనుక్కుంటే బెటర్’ అంటూ అక్కడున్న వారికి, తన ఫ్యాన్స్‌కు సరదాగా సలహా ఇచ్చారు కూడా.

ట్వింకిల్ ఖన్నా ‘మాస్టర్ ప్లాన్’: ఇండక్షన్ స్టవ్ ఆర్డర్

యుద్ధం ఎఫెక్ట్: ఇండక్షన్ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్ భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం 60% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వచ్చే సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది.  ఇప్పటికే చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా.. మరికొన్ని కట్టెల పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు సామాన్యులు కూడా ఇండక్షన్ స్టవ్‌ల కోసం ఎగబడుతున్నారు.

కిలాడీ చేతిలో అరడజను సినిమాలు.. త్వరలో ‘భూత్ బంగ్లా’ ఒకపక్క ఇంటి గ్యాస్ కష్టాలు ఇలా ఉంటే.. అక్షయ్ కుమార్ మాత్రం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla) ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సుమారు 16 ఏళ్ల తర్వాత దర్శకుడు ప్రియదర్శన్‌తో అక్షయ్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.ఇవే కాకుండా వెల్కమ్ టు ది జంగిల్ ,హేరా ఫేరి 3 హైవాన్ (సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి) వంటి క్రేజీ ప్రాజెక్టులు అక్షయ్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ విడుదల ఎప్పుడంటే?

ఈ కష్టాలు తీరేదెప్పుడో .. కోట్లు సంపాదించే అగ్ర హీరో సైతం గ్యాస్ సమస్యలకు భయపడి ఇండక్షన్ స్టవ్ కొంటున్నారంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి!

యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడటం, అక్షయ్ కుమార్ వంటి సెలబ్రిటీలు సైతం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.