
📌 Key Points
- అల్లు అరవింద్ కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో కొత్త థియేటర్ ప్రారంభించారు.
- ఈ థియేటర్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.
- సూళ్లూరుపేటలో యు.వి క్రియేషన్స్ థియేటర్, ఒక వ్యాపారవేత్త అనుభవంతో అల్లు అరవింద్ థియేటర్ నిర్మించారు.
- అల్లు సినిమాస్‌లో 75 అడుగుల పెద్ద స్క్రీన్, డాల్బీ స్క్రీన్ ఉన్నాయి; టికెట్ ధర రూ.450.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో ఒక థియేటర్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ థియేటర్ నిర్మాణానికి గల కారణాలను అల్లు అరవింద్ వివరించారు.
అల్లు సినిమాస్ ప్రారంభం
Allu Aravind: అల్లు అరవింద్ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ (Allu Aravind)ఇప్పుడు ఇండస్ట్రీలో స్టూడియో నిర్మాణంతో పాటు థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుపెట్టారు. ఈయన కోకాపేటలో అల్లు సినిమాస్ (Allu Cinemas)పేరిట ఒక థియేటర్ ప్రారంభించారు. తాజాగా ఈ అల్లు సినిమాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంతో ఘనంగా ఈ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు .ముఖ్యంగా అల్లు సినిమాస్ నిర్మించడానికి గల కారణాలను తెలియజేశారు. అల్లు సినిమాస్ నిర్మించడానికి రెండే ప్రధాన కారణాలు ఉన్నాయని ఆ కారణాల చేతే తాను నిర్మించానని తెలిపారు. ఈ థియేటర్ నిర్మాణం వెనుక మొదటి కారణం సూళ్లూర పేటలో యు.వి క్రియేషన్స్ వంశీ కట్టిన అతిపెద్ద థియేటర్ చూసిన తర్వాత నాకు ఇలాంటి థియేటర్ కట్టాలని కోరిక కలిగిందని, ఈ స్టూడియో నిర్మాణానికి అది ప్రధాన కారణమని తెలిపారు. అలాగే రెండో కారణాన్ని కూడా అల్లు అరవింద్ తెలియజేస్తూ.
థియేటర్ నిర్మాణానికి కారణాలు
నాకు బాగా పరిచయమున్న ఒక బడా వ్యాపారవేత్త మిషన్ ఇంపాజిబుల్ 6 సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రసాద్ pcx స్క్రీన్ లో టికెట్స్ కావాలని ప్రాదేయపడటం రెండో కారణమని తెలిపారు. ఇలా ఈ రెండు కారణాలతోనే నాకు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని కోరిక కలిగింది అంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా అల్లు సినిమాస్ నిర్మించడానికి కారణాలను తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక అల్లుఅర్జున్ నిర్మించిన ఈ థియేటర్ లో 75 అడుగులతో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయబడి ఉంది . ఏషియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఉన్న థియేటర్ గా అల్లు సినిమాస్ పేరు గాంచింది. ఈ థియేటర్ లో మొత్తం నాలుగు స్క్రీన్ లో ఉండగా ఒకటి మాత్రమే డాల్బీ స్క్రీన్ అని తెలుస్తోంది . అల్లు సినిమాస్ లో ఒక టికెట్ ధర 450 రూపాయలు ఉండబోతున్నట్టు సమాచారం.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రారంభం..
థియేటర్ ప్రత్యేకతలు, టికెట్ ధర
ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్లో ఉగాది పండుగను పురస్కరించుకొని మొదటి సినిమా ప్రసారం కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అల్లు సినిమాస్ లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం ధురంధర్ కూడా అల్లు సినిమాస్ లో ప్రసారం కాబోతుందని సమాచారం. ఇక ఈ థియేటర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డాల్బీ సౌండ్ సిస్టం గురించి కొన్ని ప్రసారం చేశారు. ఇందులో పుష్ప 2 తో పాటు వారణాసి రామాయణ 3D ట్రైలర్ ప్రసారం చేశారు అలాగే RRR సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా ప్రసారం చేశారు.
అల్లు అరవింద్ అల్లు సినిమాస్ ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ థియేటర్ రాబోయే రోజుల్లో సినీ అభిమానులకు ఒక ప్రత్యేక కేంద్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.


