
📌 Key Points
- త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవంతం.
- కేరళలో ‘మల్లు అర్జున్’గా బన్నీకి అపారమైన అభిమాన గణం ఉంది.
- అసోసియేషన్‌ను దేశంలోనే నంబర్ వన్ ఫ్యాన్స్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక.
- జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్, నార్త్ ఇండియాకు విస్తరణ లక్ష్యం.
అల్లు అర్జున్‌కు కేరళలో అపారమైన అభిమాన గణం ఉంది. తాజాగా త్రివేండ్రంలో జరిగిన AAFA రాష్ట్ర స్థాయి సమావేశం విజయవంతంగా ముగిసింది. భవిష్యత్ కార్యాచరణ, సౌత్ టు నార్త్ ఫ్యాన్ బేస్ విస్తరణ, జూన్ 4న మెగా ఈవెంట్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేరళలో బన్నీకి ఉన్న క్రేజ్
Allu Arjun Kerala Fans: అల్లు అర్జున్ కి కేరళ నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గూర్చి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక తాజాగా కేరళ రాజధాని త్రివేండ్రం వేదికగా జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) రాష్ట్ర స్థాయి సమావేశం అంచనాలకు మించి అత్యంత విజయవంతంగా ముగిసింది. కేరళలో ‘మల్లు అర్జున్’గా పిలవబడే బన్నీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే, అక్కడి హీరోలకైనా అంతమంది ఫ్యాన్స్ ఉంటారా అన్న డౌట్ వస్తుంది.
భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు
తాజాగా కేరళ స్టేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి సమక్షంలో జరిగిన ఈ భారీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో అభిమాన సంఘం భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కేరళలోని ప్రతి గ్రామం, ప్రతి మూలలో ఉన్న బన్నీ అభిమానులను ఏకం చేయడం, ఐకాన్ స్టార్ ఇన్స్పిరేషన్ తో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయడం మరియు జిల్లాల వారీగా పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేసి అసోసియేషన్‌ను దేశంలోనే నంబర్ వన్ ఫ్యాన్స్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దడం వంటి అంశాలపై చర్చించారు.
భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు
సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ జూన్ 4న
అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ జూన్ 4న నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ నుంచి వేలాది మంది అభిమానులు తరలిరానున్నారు. ఇది కేవలం ఒక మీటింగ్ మాత్రమే కాదు, ఐకాన్ స్టార్ స్టామినాను చాటిచెప్పే ఒక భారీ వేడుకగా ఉండబోతోంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన AAFA, ఇప్పుడు తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ‘పుష్ప’ సినిమాతో నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కు ఏర్పడిన విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇకపై ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అధికారికంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం పెద్ద విషయం కాదు కూడా .ఇక భారత్ మొత్తం జూన్ 4న జరగబోయే ఈ ఈవెంట్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది” అని కేరళ AAFA ప్రతినిధులు ఈ సందర్భంగా తమ కాన్ఫిడెన్స్ చూపించారు
జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్
ఎలాంటి సంచలనాలకి దారితీస్తుందో
కేరళలో అల్లు అర్జున్ సినిమాలకు వచ్చే వసూళ్లు, ఆయన పట్ల మలయాళీ ఆడియన్స్ చూపే ప్రేమ చూస్తుంటే, ఆయనను అక్కడ ఒక లోకల్ సూపర్ స్టార్‌గానే భావిస్తారానడంలో ఆశ్చర్యం లేదు.చూడాలి మరి రాష్ట్రాలు దాటి విస్తరిస్తున్న బన్నీ క్రేజ్ ముందు ముందు ఎలాంటి సంచలనాలకి దారితీస్తుందో !
కేరళలో ‘మల్లు అర్జున్’గా బన్నీ క్రేజ్, దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ విస్తరణ ప్రణాళికలు అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. జూన్ 4న జరగబోయే ఈవెంట్ భారత సినీ చరిత్రలో మైలురాయి కానుంది.


