|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రావిపూడి నెక్స్ట్ మూవీ సీక్రెట్ రివీల్: అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో తెలుసా?

Published: 19-02-2026, 8:35 AM
రావిపూడి నెక్స్ట్ మూవీ సీక్రెట్ రివీల్: అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో తెలుసా?
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
  • అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై వస్తున్న రూమర్స్‌పై ఆయన స్పందించారు.
  • తన తదుపరి సినిమా వివరాలను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తానని అనిల్ తెలిపారు.
  • వెంకటేష్‌తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విజయం తర్వాత తన తదుపరి సినిమాపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. ఆయన త్వరలోనే తన సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేస్తానని తెలిపారు.

బ్లాక్ బస్టర్ విజయంతో అనిల్ రావిపూడి

Anil Ravipudi: టైటిల్ చూసి, అనిల్ రావిపూడి మరీ ఇంత హార్ష్‌గా అన్నారా? అని అనుకోకండి. అంత హార్ష్‌గా అయితే చెప్పలేదు కానీ, ఆయన అధికారికంగా విడుదల చేసిన మెసేజ్‌లో ఉన్న మ్యాటర్‌కి అర్థం మాత్రం ఇదే. ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi), ఇప్పటి వరకు కెరీర్‌లో అపజయం ఎరుగని దర్శకుడి రికార్డును పదిలం చేసుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు అనిల్ రావిపూడి దొరికేస్తాడని అంతా అనుకున్నారు కానీ, ఎక్కడా దొరకలేదు. జనం మరోసారి ఆయన సినిమాకు బ్రహ్మరథం పట్టారు. తన కెరీర్‌లోనే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో కూడా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రికార్డు క్రియేట్ చేస్తారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా ఏంటి? అనే దానిపై గత కొన్ని రోజులుగా రకరకాలుగా రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి.

తదుపరి సినిమాపై వస్తున్న రూమర్స్

‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ తర్వాత మరోసారి విక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు నడుస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, వెంకటేష్ మాత్రమే కాకుండా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంది. ఇందులో నటించే తారాగణం ఎవరెవరనే దానిపై కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను చూసిన అనిల్ రావిపూడి అధికారికంగా తన పీఆర్ ద్వారా ఓ మెసేజ్‌ని విడుదల చేశారు. నా తదుపరి సినిమాకు సంబంధించి ఏదైనా ఉంటే, అది నేనే అధికారికంగా నా సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలియజేస్తాను అప్పటి వరకు కాస్త మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచండి.. అన్నట్లుగా ప్రకటించారు. ఆల్రెడీ, తన తదుపరి సినిమా విషయంపై ఇప్పటికే అనిల్ రావిపూడి త్వరలోనే చెబుతానని తెలిపారు. ఇప్పుడు మరోసారి ఆయన పీఆర్ నుంచి వచ్చిన మెసేజ్‌లో..

అనిల్ రావిపూడి ప్రకటన

తన తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా, కేవలం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే వెల్లడిస్తానని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. సినిమా గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలను, ధృవీకరించని వార్తలను ప్రచురించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అవాస్తవ కథనాలను ప్రచారం చేయడం వల్ల ప్రాజెక్ట్‌పై అనవసర గందరగోళం ఏర్పడుతుందని అనిల్ అభిప్రాయపడ్డారు. తన కొత్త ప్రాజెక్ట్ పట్ల అభిమానులు చూపిస్తున్న ఉత్సాహానికి ధన్యవాదాలు తెలుపుతూనే, అందరి మద్దతును మనస్ఫూర్తిగా అభినందిస్తూనే, సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండాలని కోరారు. త్వరలోనే అధికారిక ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు వస్తానని, అంతవరకు ఓపిక పట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేసే వరకు వేచి చూడటం మంచిది. అప్పటి వరకు వస్తున్న రూమర్లను నమ్మకుండా ఉండాలని ఆయన కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.