|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సినిమాను వదులుకున్న అనిల్ రావిపూడి! కారణం తెలిస్తే షాక్ అవుతారు!

Published: 12-01-2026, 3:30 AM
విజయ్ సినిమాను వదులుకున్న అనిల్ రావిపూడి! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
  • విజయ్ దళపతి తన చివరి సినిమాకు దర్శకత్వం వహించమని అనిల్ రావిపూడిని కోరారు.
  • రీమేక్ చిత్రం కావడంతో అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనిల్ భయపడ్డారు.
  • అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నారు.
  • జననాయగన్ చిత్రం సెన్సార్ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి విజయ్ దళపతితో సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. విజయ్ స్వయంగా తన చివరి సినిమాకు దర్శకత్వం వహించమని కోరినప్పటికీ, రీమేక్ కావడంతో ఆయన వెనక్కి తగ్గారు.

విజయ్ ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ రావిపూడి

Anil ravipudi: అనిల్ రావిపూడి(Anil Ravipudi) .. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) తర్వాత ఓటమెరుగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత ఎఫ్2, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఇలా పలు చిత్రాలు చేసి పరాజయాన్ని చవిచూడని దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా, విక్టరీ వెంకటేష్ కీ రోల్ పోషిస్తూ వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. విజయ్ దళపతి తో సినిమా చేయడంపై స్పందించి అందరి ఆశ్చర్యపరిచారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దళపతితో సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “విజయ్ దళపతి స్వయంగా నన్ను సంప్రదించి, తన చివరి సినిమాకి దర్శకత్వం వహించమని కోరారు. అయితే అది నాకు చాలా గౌరవంగా అనిపించింది. అదే సమయంలో భగవంత్ కేసరి గురించి ఆయన మాట్లాడారు.

రీమేక్ భయంతో వెనక్కి తగ్గిన డైరెక్టర్

ఆ మూవీ తనకు బాగా నచ్చిందని, అందుకే గతంలో ఆ కథను రీమేక్ చేయాలనే ఆలోచనతోనే మీ దగ్గరకు వచ్చాను అని నాతో చెప్పారు. అయితే అది విజయ్ కి చివరి సినిమా కావడం, పైగా అది రీమేక్ అయితే అభిమానులు ఎలా తీసుకుంటారో అనే భయం కారణంగానే నేను విజయ్ తో ఈ సినిమా చేయలేకపోయాను. అందుకే స్ట్రైట్ సినిమా చేయాలని మాత్రమే అనుకుంటున్నట్లు తెలిపాను అంటూ చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. మొత్తానికైతే విజయ్ చివరి సినిమా చేయాలని ఉన్నా అది రీమేక్ అని తెలిసి అభిమానులకు భయపడి వెనకడుగు వేసినట్లు అనిల్ రావిపూడి స్వయంగా చెప్పుకొచ్చారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాగా జననాయగన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను జనవరి 9న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉండగా.. సెన్సార్ కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు హెచ్. వినోద్ భారీ అంచనాలతో భగవంత్ కేసరికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడడంతో త్వరలోనే అధికారిక విడుదల తేదీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

‘మన శంకర వరప్రసాద్ గారు’తో బిజీగా అనిల్

జననాయగన్ పేరిట తమిళంలో విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత అంటూ డబ్బింగ్ వెర్షన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయానికే తన జీవితాన్ని పరిమితం చేయనున్నారు. ఇప్పటికే టీవీకే అంటూ ఒక కొత్త పార్టీని స్థాపించిన విజయ్ ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లోనే ఉండిపోవాలని భావిస్తున్నారట.

చివరి సినిమా రీమేక్ కావడంతో అభిమానుల స్పందన ఎలా ఉంటుందోననే భయంతోనే విజయ్ దళపతి సినిమాను అనిల్ రావిపూడి వదులుకున్నారు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో కలిసి పనిచేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.