|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య సంచలనం: హిందూపురంలో ఇక సొంతిల్లు! ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్!!

Published: 20-02-2026, 3:35 AM
బాలయ్య సంచలనం: హిందూపురంలో ఇక సొంతిల్లు! ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్!!
  • బాలకృష్ణ హిందూపురంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోనున్నారు.
  • వసుంధర దేవిగారితో కలిసి బాలకృష్ణ భూమి పూజ నిర్వహించారు.
  • ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • వన్నమ్మ కాలనీలో 81 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించనున్నారు.

నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సొంత ఇంటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ఆయన తన సతీమణి వసుంధర దేవిగారితో కలిసి భూమి పూజ నిర్వహించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సొంత ఇంటి కలను నెరవేర్చుకోనున్న బాలకృష్ణ

Balakrishna: సాధారణంగా సొంత ఇంటి కల అనేది సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ప్రథమ కోరిక అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సామాన్యులు ఎలా అయితే సొంత ఇంటి కలలు నెరవేర్చుకోవడానికి పరితపిస్తారో.. అటు సెలబ్రిటీలు కూడా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి అంతే కష్టపడతారు. ఈ క్రమంలోనే హిందూపురం శాసనసభ్యులు, సినీ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన సొంత ఇంటికలను నెరవేర్చుకోబోతున్నారు. అయితే ఈ కొత్త ఇంటికి శ్రీకారం చుడుతున్న బాలకృష్ణ.. ఈ ఇంటి నిర్మాణం వెనుక అసలు విషయం తెలిస్తే మాత్రం.. శభాష్ అనకమానరు. మరి బాలయ్య కొత్త ఇంటిని నిర్మించుకోవడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

60ల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ.. మరొకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హిందూపురం అభివృద్ధికి పాటుపడుతూ మరింత బిజీగా మారిపోయారు. ఇకపోతే తాజాగా ఈయన శుక్రవారం రోజు అనగా నేడు తన సతీమణి వసుంధర దేవి (Vasundhara Devi) తో కలసి బాలకృష్ణ సొంతింటి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో దాదాపు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ.. ఇన్ని రోజులు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఎట్టకేలకు హిందూపురంలో ఒక ఇంటి వాడవుతున్నారు.

2014 , 2019, 2024 సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. అయినా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడు హిందూపురం వచ్చినా సరే అంతే ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంపై ఇటీవల ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులో ఉండే బాలకృష్ణ హిందూపురంలో పరిపాలిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే వారు చేసిన కామెంట్స్ కి హిందూపురంలో ప్రకంపనలు నెలకొన్నాయి. అందుకే ప్రత్యర్ధులకు హిందూపురంలో తాను స్థానికుడిని కాదు అని చేస్తున్న వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వకూడదని ఇప్పుడు సొంత ఇంటి కలను ఆయన నెరవేర్చుకోబోతున్నారు.

భార్యతో కలిసి భూమి పూజ చేసిన బాలయ్య

అందులో భాగంగానే హిందూపురం పట్టణంలో సొంత ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. హిందూపురం సమీపంలోని వన్నమ్మ కాలనీలో సర్వే నంబర్ 445లో 81 సెంట్లు భూమిని ఎమ్మెల్యే బాలకృష్ణ కొనుగోలు చేశారు. అక్కడ తన భార్యతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఇకపోతే ఈ స్థలంలో మూడంతస్తుల భవనంతో పాటు స్విమ్మింగ్ పూల్ , ఆహ్లాదకరమైన ఉద్యానవనం, ఇతర సౌకర్యాలతో పాటు మరిన్ని ఆధ్యాత్మిక టెక్నాలజీ ఉపయోగించి , తన ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించుకోబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే తమ అభిమాన నటుడు విక్టరీ కొట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త ఇల్లు ఎలా ఉంటుందో అని హిందూపురంలో ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొకవైపు తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరం చేరువలో ఉండడానికే ఈ సొంత ఇంటి కలను నెరవేర్చుకోబోతున్నారని తెలిసి ఆయనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు హిందూపురంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టిన బాలకృష్ణ

తన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ చేసిన బాలయ్య

MLA Balakrishna is constructing his own house in Hindupur to be available and accessible to the people of his constituency. pic.twitter.com/oTk98hxYF4

— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2026

బాలకృష్ణ సొంత ఇంటి నిర్మాణం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాల విమర్శలకు ఆయన ఎలా సమాధానం ఇస్తారో వేచి చూడాలి. ఇక బాలయ్య నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కానున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.