|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ విధ్వంసం! చిన్న సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకం!

Published: 19-03-2026, 8:05 AM
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ విధ్వంసం! చిన్న సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకం!
  • భారీ బడ్జెట్ సినిమాల వల్ల సామాన్యులకు టికెట్ ధరలు భారంగా మారాయి.
  • చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమై, నష్టాలు వస్తున్నాయి.
  • ఓటీటీల వల్ల చిన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.
  • పెద్ద సినిమాల హవాలో సహజమైన కథలు కనుమరుగవుతున్నాయి.

భారతీయ సినిమా భారీ బడ్జెట్‌ల మత్తులో జోగుతోంది. దీని కారణంగా టికెట్ ధరలు పెరిగి సామాన్యుడికి సినిమా చూడటం భారంగా మారుతోంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమవుతోంది. ఈ పరిస్థితి టాలీవుడ్‌లో ఆర్థిక అరాచకానికి దారితీస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

టికెట్ ధరల మోత: సామాన్యుడికి సినిమా భారమా?

Big budgets: భారతీయ సినిమా ఇప్పుడు ‘కోట్ల’ మత్తులో జోగుతోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటేనే అబ్బా అనుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకులు మహేష్ బాబుతో తీస్తున్న అడ్వెంచర్ సినిమా కోసం ఏకంగా రూ.1300 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. రేపు ఇదిరూ.2000 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ కూడా అదే రేంజ్‌లో ఉంది. ఇవన్నీ వినడానికి గ్లోబల్ రేంజ్‌లో ‘కిక్’ ఇస్తున్నా.. వీటి వెనుక ఉన్న చేదు నిజం సామాన్య ప్రేక్షకుడిని భయపెడుతోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాల వల్ల టాలీవుడ్‌లో ఒక రకమైన ‘ఆర్థిక అరాచకం’ మొదలైందా? అన్న అనుమానాలు వస్తున్నాయి.

టికెట్ ధరల ‘బాదుడు’.. సామాన్యుడికి సినిమా ఒక లగ్జరీ!

చిన్న సినిమాలపై భారీ బడ్జెట్ ప్రభావం

పెద్ద సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి సరే.. మరి ఆ పెట్టుబడిని వెనక్కి రాబట్టేది ఎవరు? కచ్చితంగా సామాన్య ప్రేక్షకుడే! ఒక పెద్ద సినిమా చూడాలంటే ఇప్పుడు టికెట్ ధర రూ.300 నుంచి రూ.400 పలుకుతోంది. ఫ్యామిలీతో కలిసి వెళ్తే పాప్‌కార్న్, పార్కింగ్ అన్నీ కలిపి ఒక్క పూటకు కనీసం రూ.3000 వదులుకోవాల్సిందే. కేవలం బడ్జెట్ రికవరీ కోసం ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకుని మరీ టికెట్ రేట్లు పెంచుతుండటంతో.. సినిమా అనేది సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్లిపోతోంది.

చిన్న సినిమాల గొంతు కోస్తున్న ‘పెద్ద’ కటౌట్లు! ఈ భారీ సినిమాల గోల వల్ల అసలైన దెబ్బ తింటున్నది మాత్రం చిన్న సినిమాలే. రాజమౌళి, నీల్ వంటి వాళ్ల సినిమాల కోసం థియేటర్లన్నీ బ్లాక్ అయిపోతుంటే.. మంచి కథలున్న చిన్న సినిమాలకు కనీసం ‘మార్నింగ్ షో’ కి కూడా స్క్రీన్ దొరకడం లేదు. పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు, భారీ బడ్జెట్ సినిమాల ప్రచారం ముందు చిన్న కథలు గాలిలో కలిసిపోతున్నాయి. పైగా పెద్ద సినిమాల టికెట్ రేట్ల ధాటికి.. చిన్న సినిమా కోసం 200 పెట్టడానికి కూడా ప్రేక్షకులు భయపడుతున్నారు.

ఓటీటీ శాపం: కథల కొరత?

ఓటిటి శాపం.. కనుమరుగవుతున్న సహజమైన కథలు! ‘ఎలాగూ చిన్న సినిమానే కదా.. నెల రోజుల్లో ఓటిటిలోకి వస్తుందిలే’ అనే ధోరణి ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల థియేటర్ల వద్ద చిన్న సినిమాలకు వసూళ్లు రాక, నిర్మాతలకు కనీసం పోస్టర్ల ఖర్చులు కూడా మిగలడం లేదు. భారీ విజువల్స్, గ్రాఫిక్స్ ఉంటేనే సినిమా అనే భ్రమలో ఆడియన్స్ పడిపోవడంతో.. సహజమైన కథలు, కొత్త నటీనటుల ప్రయత్నాలు థియేటర్లలోనే సమాధి అవుతున్నాయి.రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి వారు ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతున్నారన్నది ఎంత నిజమో.. వారి వల్ల సామాన్యుడికి వినోదం భారంగా మారుతోందన్నది కూడా అంతే నిజం. కథ కంటే స్టార్ పవర్, భారీతనం మీదే ఇండస్ట్రీ ఇలాగే ఆధారపడితే.. భవిష్యత్తులో కేవలం ‘భారీ’ సినిమాలు మాత్రమే మిగులుతాయి, చిన్న సినిమాల ఉనికి కేవలం ఓటిటిలకే పరిమితం అవుతుంది.

ఎన్టీఆర్ ‘దేవర 2’ డౌటేనా? మే 20న షాకింగ్ అనౌన్స్‌మెంట్..

భారీ బడ్జెట్ సినిమాల హవా కొనసాగితే, చిన్న సినిమాలు మనుగడ సాగించడం కష్టమే. తెలుగు సినిమా భవిష్యత్తులో వైవిధ్యమైన కథలను చూడగలమా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.